Ads
అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ ను సరి కొత్తగా చూపించారు. గత సినిమాల్లో లాగా కాకుండా ఇందులో పూర్తి గేటప్ చేంజ్ అయిపోయింది. విశ్వక్ సేన్ చేసింది తక్కువ సినిమాలే అయినా, చాలా స్పీడ్ గా పేరు సంపాదించారు.
Video Advertisement
అతనికి బాగా పేరు తెచ్చిన సినిమా ఫలక్నామాదాస్ అని చెప్పవచ్చు. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో విశ్వక్ సేన్ చాలా వైవిధ్యమైనటువంటి పాత్రలో కనిపించాడు.. చాలా క్లాస్ పాత్రలో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
ఏది ఏమైనా అశోకవనంలో అర్జున కళ్యాణం ఎన్నో వివాదాల మధ్య భారీ అంచనాలతో విడుదలైంది. సినిమా అదిరిపోయింది అంటూ చాలా మంది ప్రేక్షకులు అంటున్నారు. ఇక ఇది ఇలా ఉంటే అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా చూసిన వాళ్ళు అంతా కూడా ఓ అమ్మాయి బాగుంది అని అంటున్నారు. ఆమె ఎవరో కాదు రితికా నాయక్. ఈ సినిమాలో రితికా నాయక్ నటించి బాగా ఆకట్టుకున్నారు.
https://instagram.com/ritika_nayak__?igshid=YmMyMTA2M2Y=
End of Article