డాన్స్ లో చిరంజీవికే పోటీగా వచ్చిన ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

డాన్స్ లో చిరంజీవికే పోటీగా వచ్చిన ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

by Mounika Singaluri

Ads

మన తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం అందరి అభిమానుల మనసులోనే ఉంటుంది. స్వయంకృషితో సినిమాలలో అడుగుపెట్టి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి తన కెరీర్ స్టార్టింగ్ నుంచే బ్లాక్ బస్టర్లు అందుకొని అభిమానులకు ఫుల్ మీల్స్ ఇచ్చేవారు. చిరంజీవి యాక్టింగ్, ఎక్స్ప్రెషన్స్ అన్ని ఒక ఎత్తు అయితే చిరంజీవి డాన్స్ అండ్ స్టైల్ మాత్రం ఇంకొక ఎత్తు.

Video Advertisement

చిరంజీవి డాన్స్ కి ఒకప్పుడు చాలా క్రేజ్ ఉండేది ఇప్పటికీ అంతే క్రేజ్ ఉంది. ఏ సినిమాలో అయినా చిరంజీవి డాన్స్ వేస్తున్నాడు అంటే ఆ సినిమా ఒక రేంజ్ లో హిట్ అయ్యేది. చిరంజీవితో డాన్స్ అంటే చాలామంది హీరోయిన్లు కూడా భయపడేవారు. అంత గ్రేస్ తో, స్టైల్ గా చిరంజీవి డాన్స్ చేస్తారు. కానీ చిరంజీవికి కూడా డాన్స్ లో పోటీగా వచ్చే హీరోయిన్లు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో ఒకరు రాధ.

రాధ, చిరంజీవి జంటగా చాలా సినిమాలు నటించారు.అందులో రాధ డాన్స్ చాలా బాగా చేస్తుంది. కొన్ని స్టెప్స్ లో నాకు పోటీగా వచ్చి టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది అని చిరంజీవి చెప్పారు. ఈ లిస్టులో మరొక హీరోయిన్ సమీరా రెడ్డి. చిరంజీవి సమీరారెడ్డి తో కలిసి జై చిరంజీవ సినిమాలో నటించారు. ఈ సినిమాలో డాన్స్ కి ఎక్కువ స్కోప్ ఉన్న సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి.

ఇందులో సమీరా తో డాన్స్ చేయడం చాలా కష్టమని, కొన్ని స్టెప్స్ లో తను తడబడినా సమీరా మాత్రం చాలా బాగా స్టెప్స్ వేసే వారని సమీరా గురించి ఎంతో గొప్పగా పొగుడుతూ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు చిరంజీవి. ఎన్ని సినిమాలు వచ్చినా ఎందరు హీరోయిన్లు వచ్చినా చిరంజీవి డాన్స్ ని డామినేట్ చేసిన హీరోయిన్లు అంటే వాళ్ళకి ఒక రేంజ్ లో వాల్యూ ఇస్తారు. ఆ లిస్టులో ఉన్న రాధ, సమీరా రెడ్డిలు ఎప్పటికీ గుర్తుండిపోతారు.


End of Article

You may also like