ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా..?

ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా..?

by kavitha

ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐఏఎస్ ఆఫీసర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న స్మితా సబర్వాల్  ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Video Advertisement

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే స్మితా సబర్వాల్ వ్యక్తిగత విషయాలను, సొసైటీలో జరుగుతున్న విషయాల పై కూడా స్పందిస్తూ, పోస్ట్ లు పెడుతుంటారు. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
స్మితా సబర్వాల్ నిన్న సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ లో ఫొటోలను షేర్ చేశారు. జనవరి 10న ఆమె తల్లి ‘పురబి దాస్’ 79వ బర్త్ డే జరుపుకుంటున్న సందర్భంగా స్మితా సబర్వాల్ ‘ఎక్స్’  వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియచేసారు. ఆ పోస్ట్ లో తల్లి ఫోటో మరియు తల్లితో ఉన్న చిన్ననాటి ఫోటోను షేర్ చేశారు.
ఆ పోస్ట్ లో ” నాకు తెలిసిన ఒకే ఒక మహిళ, నా కంటే ఎక్కువ దృఢ నిశ్చయం ఉన్న మహిళ” అంటూ తన తల్లి గురించి రాసుకొచ్చారు. అంతేకాకుండా “79వ పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఇలాంటివి మరెన్నో జరుపుకోవాలని, మీరు ‘ఎక్స్’ లో ఉన్నారని నాకు తెలుసు. రహస్యంగా నన్ను ఫాలో అవుతున్నావని తెలుసు” అంటూ స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు.
ఈ పోస్ట్ చూసిన నెటిజెన్లు పురబి దాస్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజెన్ “ఈ స్థాయికి వచ్చిన మీ వెనుక వెన్నుదన్నుగా అండగా నిలిచిన అమ్మకు వందనం…!!” అంటూ కామెంట్ చేశారు.  “మీలాంటి లీడర్ ను పెంచి పోషించిన నిజమైన లీడర్ కు జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు ఆమెకు మరింత బలాన్ని మరియు సంకల్ప శక్తిని ప్రసాదించాలని” మరొకరు కామెంట్ చేశారు. కొందరు నెటిజెన్లు చిన్నారి స్మితా సబర్వాల్  క్యూట్‌గా ఉందని కామెంట్స్ చేశారు.

Also Read: ఇదేందయ్యా ఇది…ఆర్టీసీ బస్ ని ఇలా కూడా వాడుతారా..? హైదరాబాద్ రోడ్డులపై జరిగిన స్టోరీ.!


You may also like

Leave a Comment