Ads
సినిమా ఇండస్ట్రీలో సమాజ సేవ కూడా చేస్తున్న సెలబ్రిటీలు చాలా తక్కువ మంది ఉన్నారు. అది కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అయితే ఇంకా తక్కువ మంది ఉన్నారు. వారిలో హీరోయిన్లు కూడా ఉన్నారు. అలా, సమాజ సేవ కోసం తన వంతు కృషి చేస్తున్న హీరోయిన్ సమంత.
Video Advertisement
సమంత సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లోనే ప్రత్యూష ఫౌండేషన్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ నెలకొల్పి, ఎంతో మందికి వైద్యం, ఆర్థిక సహాయం అందించారు. సమంత సామాజిక అంశాల మీద కూడా మాట్లాడుతూ ఉంటారు. సోషల్ మీడియా ద్వారా ఎన్నో విషయాలను షేర్ చేస్తూ ఉంటారు.
సమంత ఇటీవల టేక్ 20 అనే ఒక పాడ్ కాస్ట్ మొదలు పెట్టారు. ఇందులో కొన్ని ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద సమంత మాట్లాడుతున్నారు. ఈ పాడ్ కాస్ట్ సమంత యూట్యూబ్ ఛానల్ లో ఉంది. ఈ పాడ్ కాస్ట్ 2 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. అయితే ఇందులో సమంత చెప్పిన ఒక విషయం మీద ఒక డాక్టర్ ఫైర్ అయ్యారు. తెలివి లేకుండా ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు అని చెప్పారు. ఇటీవల సమంత చెప్పిన పాడ్ కాస్ట్ లో లివర్ డిటాక్సింగ్ అనే అంశం మీద మాట్లాడారు. అసలు అలా చేయడం కుదరదు అని ఈ డాక్టర్ చెప్పారు. ద లివర్ డాక్ పేరుతో ఈ డాక్టర్ సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి.
సమంత ఈ అంశం మీద మాట్లాడినది అంతా కూడా తప్పు అంటూ ఆ డాక్టర్ వివరంగా దానికి సంబంధించిన విషయాలని చెప్పారు. అసలు మానవ శరీరం అనేది ఎలా పని చేస్తుంది అనే విషయం తెలియదు అని అన్నారు. ఈ విషయం మీద తప్పుడు వివరణ, తప్పుడు సందేశం ఇస్తున్నారు అని చెప్పారు. ఆరోగ్యం గురించి తెలియని ఒక అజ్ఞాని ఈ వీడియోలో మాట్లాడారు అని సమంతతో ఉన్న మరొక వ్యక్తి గురించి కూడా ఈ డాక్టర్ చెప్పారు.
This is Samantha Ruth Prabhu, a film star, misleading and misinforming over 33 million followers on "detoxing the liver."
The podcast feature some random health illiterate "Wellness Coach & Performance Nutritionist" who has absolutely no clue how the human body works and has the… pic.twitter.com/oChSDhIbu2
— TheLiverDoc (@theliverdr) March 10, 2024
End of Article