Ads
గాల్వన్ లోయలో ఘర్షణలు చెలరేగి 20 మంది సైనికులు చనిపోయిన విషయం తెలిసిందే.అయితే చెన్నై సూపర్ కింగ్స్ టీం కు డాక్టర్ గా వ్యవహరిస్తున్న మధు ఈ సంఘటనపై వ్యంగ్యంగా ట్వీట్ చెయ్యడం వలన చెన్నై సూపర్ కింగ్స్ లో తన పదవిని కోల్పోయారు .ఆ వివరాల్లోకి వెళ్తే ..
Video Advertisement
అమరులైన జవాన్ల సేవపేటికలకు పీఎం కెర్స్ అని స్టికర్ అంటించి తీసుకువస్తారా అంటూ చెన్నై సూపర్ కింగ్స్ కు డాక్టర్ గా సేవలు అందిస్తున్న మధు ట్వీట్ చేసారు.జవాన్లు చనిపోయి అందరూ తీవ్ర విషాదంలో ఉంటె మధ్యలో ఇలా వ్యంగ్యంగా రాజకీయాలను టచ్ చేసేలాగా ట్వీట్ చెయ్యడం ఏంటి అని నెటిజన్లు మండిపడుతున్నారు.కాగా ఆ ట్వీట్ చెన్నై సూపర్ కింగ్స్ అభిప్రాయమా అంటూ చాలామంది సోషల్ మీడియా లో ప్రశ్నించడం మొదలుపెట్టారు.అయితే ఆ ట్వీట్ కు చెన్నై సూపర్ కింగ్స్ కు ఎటువంటి సంబంధం లేదు అని అది కేవలం డాక్టర్ మధు అభిప్రాయమే అని చెన్నై సూపర్ కింగ్స్ అధికారికంగా ప్రకటించింది.
అయితే బాధ్యతారహితంగా జవాన్ల మరణంపై ఇలాంటి ట్వీట్ చేసినందుకు డాక్టర్ మధు ను చెన్నై సూపర్ కింగ్స్ డాక్టర్ గా తొలగిస్తున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ అధికారికంగా ట్విట్టర్ లో ప్రకటించింది.అయితే చెన్నై సూపర్ కింగ్స్ మొదటి సీజన్ మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు డాక్టర్ మధు చెన్నై సూపర్ కింగ్స్ తోనే కొనసాగారు.అయితే ఒక్క ట్వీట్ కారణంగా జట్టుకు శాశ్వతంగా దూరం అయ్యారు డాక్టర్ మధు.
Apology ….
On 16th June, I had put out a tweet, and after I realised that the words used by me was inappropriate and unintended. I deleted the same. But by then there were screenshots of my tweet being circulated and shared in social media. It was never my intention to .1/5 pic.twitter.com/nvC7FjMFGl— Dr. Madhu Thottappillil (@itsmadhu) June 18, 2020
అయితే దీనిపై డాక్టర్ మధు ఇలా వివరణ ఇచ్చారు…”జూన్ 16 న, నేను ఒక ట్వీట్ పెట్టాను, మరియు నేను ఉపయోగించిన పదాలు తగనివి మరియు అనాలోచితమైనవి అని తెలుసుకున్న తరువాత నేను ఆ ట్వీట్ ను తొలగించాను. కానీ అప్పటికి నా ట్వీట్ యొక్క స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.”
End of Article