ఫ్యాషన్ డిజైనర్‌తో డాక్టర్ అఫైర్…భార్యకు ఇంజక్షన్ ఇచ్చి ఎంత ప్లాన్ చేసాడో చూడండి!

ఫ్యాషన్ డిజైనర్‌తో డాక్టర్ అఫైర్…భార్యకు ఇంజక్షన్ ఇచ్చి ఎంత ప్లాన్ చేసాడో చూడండి!

by Megha Varna

వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని చిదిమేసింది. భార్యకు విషం ఇంజెక్షన్‌ ఇచ్చి హత్య చేసిన డాక్టర్‌ ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. సంబంధం పెట్టుకున్న యువతి కూడా ప్రాణాలు తీసుకుంది. ఇద్దరు చిన్నారులు అనాధలవ్వగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.వివరాలలోకి వెళ్తే..

చిక్కమగళూరు జిల్లా కడూరులో డాక్టర్‌ రేవంత్, కవితలు నివాసం ఉంటున్నారు. ఉడుపి పట్టణంలోని లక్ష్మీనగరకు చెందిన బసవరాజప్ప కుమార్తెను కడూరుకు చెందిన డాక్టర్‌ రేవంత్‌ ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఆరు నెలల చిన్నారితో పాటు ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. రేవంత్‌ బీరూరులో డెంటల్‌ క్లినిక్‌ నడుపుతున్నాడు.

వివాహానికి ముందునుంచే డాక్టర్‌ రేవంత్‌కు హర్షిత అనే యువతితో ప్రేమాయణం సాగుతోంది. పెళ్ళి తర్వాత కూడా వారి బంధం కొనసాగింది. ఇది ఇలాఉండగా హర్షిత, బీఎంటీసీ ఉద్యోగి సుధీంద్రను పెళ్ళి చేసుకుని బెంగళూరు రాజరాజేశ్వరీనగర్‌లో నివసిస్తోంది. ఇలా సాగుతుండగానే రేవంత్‌, హర్షితాల వివాహేతర సంబంధం అతడి భార్య కవితకు తెలిసింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ తలెత్తింది. గొడవ తీవ్రం కావడంతో ఈనెల 17న భార్య కవితకు ఇంజెక్షన్‌ ఇచ్చి ఆ తర్వాత గొంతుకోసి భర్త రేవంత్‌ దారుణానికి పాల్పడ్డాడు. ఇది దోపిడీ దొంగల పనేనని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసుల నివేదికలో భర్త రేవంత్ హత్య చేసినట్టు తేలింది. దీంతో రేవంత్‌ను విచారణ చేయాలని అతని ఫోన్‌కాల్స్‌ లిస్ట్‌ను కూడా తెప్పించారు. దీంతో భయపడిన రేవంత్‌ శుక్రవారం రాత్రి చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా బండికొప్పలు వద్ద కారు నిలిపి సమీపంలోని రైల్వే పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు రేవంత్‌ హర్షిత (32)కు ఫోన్‌ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. రేవంత్‌ ఆత్మహత్య చేసుకున్న కొన్ని నిముషాల వ్యవధిలోనే బెంగళూరు ఆర్‌ఆర్‌ నగర జవరేగౌడ లేఔట్‌లో నివాసం ఉంటున్న హర్షిత కూడా డెత్‌నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అలా వివాహేతర సంబంధం ముగ్గురిని బలితీసుకుంది. పిల్లలని అనాథలను చేసింది.

You may also like