Home News భర్త ఆస్తిపై రెండో భార్యకు హక్కు ఉంటుందా.? కోర్ట్ ఏం తీర్పు ఇచ్చింది.?

భర్త ఆస్తిపై రెండో భార్యకు హక్కు ఉంటుందా.? కోర్ట్ ఏం తీర్పు ఇచ్చింది.?

by Mohana Priya

ఒక కుటుంబంలో గొడవలు రావడం సహజం. అవి కొన్ని సార్లు మామూలు గొడవలు అయితే, కొన్ని సార్లు మాత్రం ఆస్తికి సంబంధించిన గొడవలు ఉంటాయి. ఈ ఆస్తికి సంబంధించిన గొడవలు పరిష్కరించడానికి కూడా చాలా సమయం పడుతుంది. ఇందులో చాలా లాజిక్ లు ఉంటాయి. మామూలుగా ఆస్తి వారసత్వంగా వస్తుంది అని అంటారు.

Does second wife have rights on husband's property

అయితే “ఒక వ్యక్తి రెండో పెళ్లి చేసుకుంటే ఆస్తి ఎవరికి చెందుతుంది?” అనే విషయంపై ఇప్పటికి కూడా కొన్ని చోట్ల చర్చలు జరుగుతాయి. ఇటీవల ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే డైలీ హంట్ (తుపాకీ.కామ్) కథనం ప్రకారం యూపీ కి చెందిన ఒక వ్యక్తి 14 సంవత్సరాల క్రితం ఒక ముస్లిం మహిళను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వివాహం చేసుకున్నారు. అయితే అప్పటికే ఆ వ్యక్తికి పెళ్లి అయ్యింది సంతానం కూడా ఉన్నారు.

Rights of married daughter in father's property

2015 లో ఆ వ్యక్తి మరణించారు. ఆయన ఆస్తి ఎవరికి రావాలి? మొదటి సంతానానికా? రెండో భార్యకా? అనే విషయంపై చర్చ మొదలైంది. ఈ విషయంపై మొదటి భార్య సంతానం 2016 లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వాళ్ళ తండ్రికి జరిగిన రెండవ వివాహం చెల్లదు అని, ఎందుకంటే ఆ మహిళని ఆయన చట్టబద్దంగా పెళ్లి చేసుకోలేదు అని ఆరోపించారు.

Difference between lawyer and advocate

ఆ మహిళ తన మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండానే తమ తండ్రిని పెళ్లి చేసుకుందని, అందుకే ఇది చెల్లదు అని వాదించారు. అయితే ఈ పెళ్ళి ప్రశ్నించే హక్కు మొదటి భార్య సంతానానికి లేదు అని రెండవ భార్య తరపున లాయరు వాదించారు. ఈ వివాహం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం జరిగింది అని, అంతే కాకుండా పెళ్లయిన 10 సంవత్సరాల తర్వాత ఈ కేసు దాఖలు చేశారు అని, ఆస్తి కోసమే ఇదంతా చేశారు అని వాదించారు.

Does second wife have rights on husband's property

అయితే ఇద్దరూ అధికారికంగానే వివాహం చేసుకున్నారు ఈ కేసులో చట్టపరంగా ఇద్దరూ భార్యలే. ఈ కేసులో ఇరువర్గాలకు నోటీసులు జారీ చేసింది కోర్ట్. దాంతో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ వివరణను పరిశీలించాలని కోరుతూ ప్రభుత్వానికి కూడా నోటీసులు పంపించింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.

You may also like