ప్రతి గురువారం, శుక్రవారం మనల్నందరిని అలరిస్తున్న ప్రోగ్రామ్స్ జబర్దస్త్ ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెల్లమెల్లగా జనాల్లోకి స్ప్రెడ్ అవుతూ, ఇప్పుడు టాప్ షోస్ గా నిలిచాయి. ఈ రెండు ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు మన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఒక రోజు జబర్దస్త్ లో అనసూయ యాంకర్ గా మనల్ని అలరిస్తుంటే, మరొక రోజు ఎక్స్ట్రా జబర్దస్త్ లో రష్మీ యాంకర్ గా మనల్ని ఎంటర్టైన్ చేస్తారు.
జబర్దస్త్ ద్వారా పేరుతెచ్చుకున్న కమెడియన్స్ లో సుధీర్ ఒకరు. సుధీర్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది సుధీర్ ఇప్పుడు జబర్దస్త్ వదిలి వెళ్ళిపోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. సినిమా అవకాశాల కారణంగా జబర్దస్త్ స్టేజి కి సుధీర్ దూరమవుతున్నారు అనే వార్త చాలారోజుల నుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. అయితే తాజాగా వచ్చిన ప్రోమోలో… దీని గురించి సుధీర్ ఏమన్నారో మీరే చూడండి.

ఈ ప్రోమోలో సుధీర్ స్కిట్ లో రామ్ ప్రసాద్, శీను, సుధీర్ ముగ్గురు డాన్స్ చేస్కుంటూ వస్తారు. మేము వేరే ఇంటర్వ్యూ ఇచ్చి చెప్దాము అనుకున్నాం. కానీ ఈ వేదిక మీద చెప్పాల్సి వస్తుంది. మమ్మల్ని క్షమించండి . ఇన్ని రోజులు మమ్మల్ని ఆదరించినందుకు అంటూ కంటతడి పెట్టుకుంటారు. మరి ఇది స్కిట్ లో ఒక భాగమా.? లేక నిజంగానే ఇదే చివరి స్కిట్టా అనేది తెలియాలి అంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.
watch video:
