Ads
లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాల తర్వాత నాగ చైతన్య మళ్లీ థాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకు ముఖ్య కారణం నాగ చైతన్య – విక్రమ్ కె కుమార్ కాంబినేషన్. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య మనం సినిమాలో నటించారు.
Video Advertisement
ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో వీరిద్దరూ మళ్లీ కలిసి ఈ సినిమా చేస్తున్నారు అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అంతే కాకుండా ఈ సినిమా టీజర్, ట్రైలర్ కూడా కొత్తగా అనిపించాయి. నాగ చైతన్య ఈ సినిమాలో మూడు రకమైన పాత్రల్లో నటిస్తున్నారు అని అర్థమవుతోంది. ఈ సినిమాలో మాళవిక నాయర్, అవికా గోర్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తమన్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూలై 22 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముందే విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. అయితే ఈ సినిమాలో నాగ చైతన్య క్లాస్ లుక్ పాత్రలో కనిపిస్తున్నారు. నాగ చైతన్య గత సినిమాలని గమనిస్తే నాగ చైతన్య ఇలా క్లాస్ లుక్ లో కనిపించిన ఈ సినిమాలో అన్నీ కూడా హిట్ అయ్యాయి. ఇప్పుడు అదే జాబితాలోకి థాంక్యూ కూడా చేరుతుంది అని అంటున్నారు. ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయితే నాగచైతన్య ఖాతాలో హ్యాట్రిక్ పడడం అని అంటున్నారు.
End of Article