డోలో 650 టాబ్లెట్ వల్ల ఆ కంపెనీకి ఎంత లాభం వచ్చిందో తెలుసా..? ఈ రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్..!

డోలో 650 టాబ్లెట్ వల్ల ఆ కంపెనీకి ఎంత లాభం వచ్చిందో తెలుసా..? ఈ రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్..!

by Megha Varna

కరోనా మహమ్మారి వలన చాలా మంది ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడ్డారు, పడుతున్నారు. ఒమీక్రాన్ వలన ఇప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఏది ఏమైనా సరే ఈ మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గత కొన్ని రోజుల నుండి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా తల నొప్పి, జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

Video Advertisement

ఒక్క సారిగా ఏమైందో తెలియదు కానీ ఇంటికి ఒకరైన సరే ఈ సమస్యల బారిన పడుతున్నారు. అయితే వీటి నుంచి బయట పడడానికి డోలో 650 వేసుకుంటున్నారు. ఈ డోలో వినియోగం ఎంతలా వుంది అంటే ఏకంగా సోషల్ మీడియా లో మీమ్స్ కూడా వచ్చేసాయి. పైగా డోలో అమ్మకాలు కూడా భారీగా పెరిగిపోయాయి. కరోనా మహమ్మారి రాక ముందు ఇంత సేల్స్ లేవు. కరోనా వచ్చిన తరవాతే ఈ మాత్రల సేల్స్ పెరిగింది.

కరోనా కాలంలో డోలో 650 కి పెరిగిన డిమాండ్ అంతా ఇంతా కాదు. పైగా కరోనా నుంచి బయట పడడానికి కూడా వైద్యులు ఈ డోలో ని వేసుకోమంటున్నారు. నిజానికి డోలో 650 ఒక సెలబ్రిటీగా మారిపోయింది. ఒక అరుదైన రికార్డును కూడా ఈ టాబ్లెట్ సొంతం చేసుకుంది. ఆ రికార్డ్ ఏమిటంటే..? కరోనా సమయంలో దేశంలోనే అత్యధికంగా అమ్ముడయిన టాబ్లెట్ గా ఈ డోలో నిలిచింది.

ఇక ఎన్ని టాబ్లెట్లు అమ్ముడుపోయాయి అన్న విషయానికి వస్తే.. గత ఏడాది అంటే 2020లో 350 కోట్ల డోలో ట్యాబ్లెట్స్‌ సేల్ అయ్యాయి. కానీ కరోనా ముందు ఇంత సేల్స్ లేవు. 2019లో 75 మిలియన్ల డోలో మాత్రలని విక్రయించగా.. 307 కోట్ల టర్నోవర్ 2021 లోని నమోదు అయ్యింది. పైగా ఈ డోలో 650 భార‌త్‌ లో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన ట్యాబ్లెట్స్‌లో రెండవ స్థానంలో వుంది. మొదటి స్థానంలో అయితే కాల్‌పోల్ వుంది.


You may also like