అలాంటి మాస్క్ వాడకూడదు అంటూ ప్రభుత్వం రూల్… ఎందుకో తెలుసా?

అలాంటి మాస్క్ వాడకూడదు అంటూ ప్రభుత్వం రూల్… ఎందుకో తెలుసా?

by Mohana Priya

Ads

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫేస్ మాస్క్ ప్రతి మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. మాస్క్ వేసుకోవడం సౌకర్యవంతంగా లేకపోయినా కూడా ఆరోగ్యం కాపాడుకోవడానికి కచ్చితంగా ధరించాల్సివస్తోంది. ఫేస్ మాస్క్ లలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఒక్కొక్క రకం ఒక్కొక్క ధరలో ఉంటోంది. కొన్ని ఫేస్ మాస్క్ ల మీద అయితే బొమ్మలు కూడా ప్రింట్ చేస్తున్నారు.

Video Advertisement

ఫేస్ మాస్క్ లను ధరించే విధానంపై భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు ఇటీవల ఒక ప్రకటన విడుదల చేశారు. రెస్పిరేటర్ వాల్వ్స్ ఉన్న మాస్క్ లను వాడడం మంచిది కాదు అని చెప్పారు. కరోనా వైరస్ రాకుండా ఉండడానికి అవి పనికి రావట.

దీనిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, రాజీవ్ గార్గ్ మాట్లాడుతూ “రెస్పిరేటర్ వాల్వ్స్ ఉన్న ఎన్ 95 మాస్కులు ధరించడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆపలేము. రెస్పిరేటర్ వాల్వ్స్ ద్వారా బయటకు గాలి లోపలికి వస్తుంది కానీ లోపల ఉన్న గాలి బయటికి వెళ్లే అవకాశం లేదు. ఇది దృష్టిలో పెట్టుకొని మీ ముక్కు నోరు కవర్ అయ్యేలా మాస్కు ధరించాలి అని, అంతే కాకుండా ఎన్ 95 మాస్కులను నిషేధించాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను” అని అన్నారు.

రెస్పిరేటర్ వాల్వ్స్ ఉన్న మాస్కులు హెల్త్ కేర్ లో పనిచేసేవాళ్ళు లేదా కన్స్ట్రక్షన్ సైట్ లలో పనిచేసే వాళ్లు ఎక్కువగా వాడతారు. మాస్క్ కి ఒక ఫిల్టర్ ఉంటుంది, అంతేకాకుండా మాస్క్ ముందు భాగంలో ఒక వాల్వ్ ఉంటుంది. దానివల్ల గాలి సరిగా అంది ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఉండదు.

ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా దొరుకుతున్న మాస్క్ లకి రెస్పిరేటర్ వాల్వ్స్ వన్ వే మాత్రమే ఉంటాయి. దాంతో బయటి నుంచి వచ్చే గాలి శుభ్రంగా వస్తుంది కానీ మనం శ్వాస వదిలినప్పుడు బయటికి వెళ్లే గాలి ఫిల్టర్ అవ్వదు. ఒకవేళ మాస్క్ కి టు వే రెస్పిరేటర్ వాల్వ్స్ ఉంటే అలాంటివాటిని ఏ అనుమానం లేకుండా వాడొచ్చు.

ఒకవేళ మీకు ముక్కుకి పట్టేసినట్టుగా ఉండే మాస్కులు ధరించడం ఇబ్బందిగా ఉంటే ఇలా బాతు మూతి లాగా ఉండే మాస్క్ లను వాడండి. వీటికి గాలి తీసుకోవడానికి ఒక ఇన్లెట్ అలాగే గాలి బయటికి వెళ్లడానికి ఒక అవుట్లెట్ ఉంటుంది.

బట్టతో తయారు చేసిన ఫేస్ మాస్కులు అన్నిటికంటే సురక్షితం అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు చెబుతున్నారు. అంతేకాకుండా మాస్కులను తరచుగా ఉప్పు వేసిన వేడినీళ్ల లో ఉతికి ఆరబెట్టి పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే ఉపయోగించాలట.

ఒక మాస్కును రోజులో ఎనిమిది గంటల కంటే ఎక్కువ సేపు ధరించడం మంచిది కాదట. ఎక్కువసేపు ధరిస్తే ఊపిరి తీసుకొని వదిలినప్పుడు వచ్చే ఆవిరి వల్ల మాస్కులు తడిగా అయిపోతాయి. అలా తడిగా ఉన్న మాస్కులను ఉపయోగించకుండా కొత్త మాస్కులు వాడాలట. అంతేకాకుండా మనం వాడిన మాస్కును ఇతరులకి ఇవ్వకుండా, ఎవరి మాస్క్ వారే ఉపయోగించాలట.


End of Article

You may also like