జబర్దస్త్ దొరబాబు పేరును టాటూ లా వేయించుకుంది ఆమె..! వెలుగులోకొచ్చిన మరో విషయం.!

జబర్దస్త్ దొరబాబు పేరును టాటూ లా వేయించుకుంది ఆమె..! వెలుగులోకొచ్చిన మరో విషయం.!

by Sainath Gopi

Ads

కెరీర్ స్టార్టింగులో బి గ్రేడ్ షార్ట్ ఫిలిమ్స్ లో నటించడంతో అమ్మాయిల పిచ్చి ఉన్న వాడిగా దొరబాబుపై హైపర్ ఆది తో పాటు సహా పార్టిసిపెంట్స్ సెటైర్లు వేస్తూనే ఉంటారు ,ఆ విషయం అందరికి తెలిసిందే…కానీ ఆ తర్వాత అతను పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యాడు అనుకున్నాము. ఇప్పుడు ఇలా అరెస్ట్ అయ్యే సరికి పెళ్లయ్యాక కూడా ఇంకా అవేం పనులు అని తిడుతున్నారు అందరు.

Video Advertisement

దొరబాబు, పరదేశిలు వ్యభిచార గృహంలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన పోయిన సంగతి అందరికి తెలిసిందే. ఓ అపార్ట్‌మెంట్‌లో  వ్యభిచార గృహంపై పోలీసులు జరిపిన దాడుల్లో జబర్దస్త్‌ కామెడీ షో ఆర్టిస్టులు దొరబాబు, పరదేశి పట్టుబడ్డారు.విశాఖపట్నంలోని మాధవధారలో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఇద్దరు వ్యభిచార గృహ నిర్వాహకులు సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌లో వారిని విచారిస్తున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే…నెల్లూరుకు చెందిన ఓ లోకల్ ఛానల్‌ లో యాంకర్ గా చేసే అమూల్య రెడ్డి(నందిని రెడ్డి) ని 2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు దొరబాబు. ఆమె టిక్ టాక్ వీడియో లతో కూడా తెలుగు ఆడియన్స్ లో బాగానే ఫేమస్ అయ్యింది. తన భర్త వ్యభిచార గృహంలో దొరికిన రోజునే ఆమె టిక్‌లో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. డి ఫర్ దొరబాబు, మై లైఫ్ లవ్ యు సోమచ్ బుజ్జీ అంటూ టాటూ వేయించుకుంది దొరబాబు భార్య నందిని రెడ్డి.

గతంలో భార్య భర్తలు ఇద్దరు కలిసి టిక్ టాక్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేసారు . @ammu0574167 ఇదే దొరబాబు భార్య నందిని టిక్ టాక్ ఐడీ. ఈ ఐడి తోనే వీడియోస్ పోస్ట్ చేసేది. భర్త అలా అరెస్ట్ అయిన రోజే ఆమె ఇలా టాటూ వేయించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


End of Article

You may also like