బాలు గారి మరణం గురించి డా.సి.ఎల్.వెంకట్ రావు గారు చెప్పిన అసలు అంశాలు.!

బాలు గారి మరణం గురించి డా.సి.ఎల్.వెంకట్ రావు గారు చెప్పిన అసలు అంశాలు.!

by Mohana Priya

Ads

శ్రీ ఎస్ పీ బాలసుబ్రమణ్యం గారు సెప్టెంబర్ 25 వ  తేదీ మధ్యాహ్నం స్వర్గస్థులయ్యారు. బాలు గారు జూన్ 4 న , 1946 లో జన్మించారు. గాయకుడిగా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా కూడా ఎంతో పేరు సంపాదించారు బాలు గారు. సినీ సంగీతం లో ఆయన కృషి ని ప్రశంసిస్తూ జాతీయ ప్రభుత్వం 2001 లో పద్మశ్రీ ని, 2011 లో పద్మ భూషణ్ ని ప్రకటించింది. బాలు గారు ఆరు సార్లు జాతీయ స్థాయి లో ఉత్తమ గాయకుడిగా అవార్డును అందుకున్నారు.

Video Advertisement

కొద్ది రోజుల క్రితం తనకి కరోనా పాజిటివ్ వచ్చింది అని, ట్రీట్మెంట్ తీసుకోబోతున్నాను అని, త్వరలోనే మళ్ళీ మామూలు గా అవుతాను అని సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు బాలు గారు. బాలు గారి మరణం పై ఎన్నో రంగాలకు చెందిన ఎంతోమంది ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలుగు పాపులర్ టీవీ యూట్యూబ్ ఛానల్ లో డాక్టర్ సి.ఎల్. వెంకట్ రావు గారు మాట్లాడుతూ, బాలు గారు తన ఇంట్లో వాళ్లకి ఈ వైరస్ వ్యాపించకూడదు అనే సంకల్పంతో, తనకి కరోనా సింప్టమ్స్ చాలా మైల్డ్ గా ఉన్నా కూడా హాస్పిటల్ కి వెళ్లారు అని,

ఇప్పుడున్న గణాంకాల ప్రకారం వెంటిలేటర్ పై పెట్టిన తర్వాత కేవలం 10 శాతం మంది మాత్రమే బతుకుతారని, అలాగే ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ఎక్మో) పరికరం వాడిన తర్వాత 100 కి ఇద్దరు మాత్రమే బతుకుతారు అని, ఒకవేళ సింప్టమ్స్ తక్కువగా ఉంటే, వైరస్ లక్షణాలు కనిపించిన మొదటిలోనే కొన్ని మందులు వాడాలి అని, కానీ నెగిటివ్ వచ్చినంత మాత్రాన వైరస్ పూర్తిగా నయమయింది అని అనుకోకూడదు అని, బాలు గారికి కరోనా నెగిటివ్ వచ్చినా కూడా వైరస్ యొక్క ప్రభావం కొనసాగింది అని అన్నారు.

watch video :

https://www.youtube.com/watch?v=09fI6WZGfvE


End of Article

You may also like