Ads
కన్నడ స్టార్ నటుడు పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటు కారణంగా మరణించారు. పునీత్ కి కేవలం కన్నడలో ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా, ఇతర భాషల ఇండస్ట్రీలలో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది. గత శుక్రవారం ఉదయం జిమ్ లో వ్యాయామం చేస్తున్నప్పుడు పునీత్ ఒక్కసారిగా కిందపడిపోయారు. ఆస్పత్రికి వెళ్లే సరికి పునీత్ పరిస్థితి చాలా విషమంగా ఉంది అని డాక్టర్లు చెప్పారు. చికిత్స అందించిన కొంతసేపటి తర్వాత పునీత్ తుది శ్వాస విడిచారు.
Video Advertisement
అయితే, పునీత్ రాజ్‌కుమార్ చేసిన ఒక పొరపాటు కారణంగా ఇలా జరిగింది అని వార్తలు వచ్చాయి. పునీత్ కి వర్కౌట్స్ అంటే చాలా ఇష్టం. ఒక్క రోజు కూడా వ్యాయామం చేయకుండా లేరు. పునీత్ వయసు ఇప్పుడు 46 సంవత్సరాలు. ఈ వయసులో అంత కఠినమైన వ్యాయామం చేయడం వలన ఆరోగ్యానికి ముప్పు ఉంటుంది అని అంటారు. అంతే కాకుండా, పునీత్ కి గత గురువారం రాత్రి గుండెలో కొంచెం నొప్పిగా అనిపించింది అని, ఆ నొప్పితోనే వ్యాయామం చేయడానికి వెళ్లారు అనే వార్తలు కూడా వచ్చాయి.
ఈ నేపథ్యంలో, నారాయణ హెల్త్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చైర్మన్ అయిన దేవి శెట్టి నుండి వచ్చిన ఒక మెసేజ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ మెసేజ్ లో ఈ విధంగా రాసి ఉంది. “గత కొన్ని సంవత్సరాలలో నేను 8,9 వ్యక్తులని కోల్పోయాను. వారిలో కొంత మంది సెలబ్రిటీలు కూడా ఉన్నారు. వారు 40 సంవత్సరాలు పైబడిన వారు. ఫిట్‌గా ఉండడానికి ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసేవారు. కానీ వాళ్లు చూడడానికి మాత్రమే ఫిట్‌గా ఉండేవారు. ఈ లిస్ట్ లో ఇప్పుడు పునీత్ రాజ్‌కుమార్ కూడా చేరారు. జీవితంలో ఏదైనా సరే మితంగా మాత్రమే చేయాలి.”
“20 నిమిషాల ఎక్సర్సైజ్ చేయండి, అన్ని రకాల ఆహారాలని తీసుకోండి. కీటో డైట్ లాంటివి పాటించకండి. ఒకవేళ మీకు 40 ఏళ్లు పైబడి ఉంటే, మీరు పైన చెప్పిన జాగ్రత్తలు పాటించకపోతే, ఇప్పుడే అలవాట్లను మార్చుకోండి. మీరు కూడా మీ జీవితంలో ఇలాంటి సమస్య ఎదుర్కోకూడదు. దయచేసి జాగ్రత్తగా చదవండి.” అని ఈ మెసేజ్ సారాంశం. ఈ మెసేజ్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. దాంతో దేవి శెట్టి కొన్ని విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. ఈ విషయంపై దేవి శెట్టి అధికారిక ప్రకటన విడుదల చేశారు. అది అంతా ఫేక్ అని, అసలు తాను అలాంటి మెసేజ్ చేయలేదు అని నిర్ధారించారు.
End of Article