Ads
అప్పుడప్పుడు పట్టుబడ్డ నిందితులు తాము చేసిన తప్పుకు ఇచ్చిన వివరణ వింటే వింతగా మరియు నవ్వుకునే విధంగా ఉంటాయి.ఇలాంటి కేసులలో దాదాపు 100కి 90 శాతం కేసులలో నిందితులు తప్పించుకోవడానికి వింత కారణాలు చెబుతారని ఎన్నో సర్వేలు చెబుతున్నాయి.ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? అయితే మీకు ఇంగ్లండ్‌లోని సౌత్ యార్క్‌షైర్‌లో ఓ కారు డ్రైవర్ గురించి తెలియాలి.
Video Advertisement
ఇతడు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో అర్జంటుగా బాత్రూం వచ్చింది. కానీ అప్పటికే హైవేపై ఉండడంతో ఏమి చేయాలో తెలియక ఎక్స్ లేటర్ పై కాలు పెట్టీ తొక్కాడు. దానితో ఏకంగా గంటకు 185 కి.మీ.(115 మైళ్లు) వేగంతో రయ్‌మని హైవే పై దూసుకుపోయాడు. హైవేల పై అతి వేగంగా వెళ్తున్న వారిని పట్టుకోవడం కోసం కాపు కాసే పోలీసుల కంట ఇది పడింది.దానితో వెంటనే పోలీసులు మనోడిని చేజ్ చేయడం మొదలుపెట్టారు.అది గమనించిన సదరు కార్ డ్రైవర్ ఏమాత్రం స్పీడు తగ్గించకుండా పోలీసులు పట్టుకునేదాకా ఆగకుండా వెళ్ళాడు.
అతడిని పట్టుకోవడానికి సినిమాలలో చూపించే స్టంట్స్ అన్నీ వేసి చివరికి పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అసలు అతను అంత వేగంగా వెళ్ళడానికి కారణం ఏంటని పోలీసులు ప్రశ్నించగా దానికి మనోడు యూరిన్ వెళ్ళడం కోసం లండన్ నుండి వేగంగా కార్ ను నడుపుతున్నట్లు సమాధానం ఇచ్చాడు.దానితో అది విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.ఆ కారు వేగాన్ని బంధించిన స్పీడ్ గన్ ఫోటోను మనోడు చెప్పిన కథను రాసి సోషల్ మీడియా లో పెట్టారు.
త్వరలో అతివేగంగా వెళ్లినందుకు అతన్ని కోర్టు లో ప్రేవేశపెట్టనున్నటు ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.దానితో అతనికొచ్చిన కష్టం మరెవ్వరికీ రాకూడదని పాపం సోషల్ మీడియాలో కామెంట్ లతో నెటిజన్స్ సానుభూతిని చూపిస్తున్నారు.
End of Article