“దృశ్యం” చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.? ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది..!

“దృశ్యం” చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.? ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది..!

by Megha Varna

Ads

బాల నటులుగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన నటులంతా తర్వాత మెగాఫోన్ పట్టడానికి మెయిన్ లీడ్ గా నటించి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.కాని  అందులో సక్సెస్ అయినవాళ్ళ సంఖ్య చాలా తక్కువ.2014లో  వెంకటేష్ నటించిన దృశ్యం చిత్రంలో రెండవ కూతురిగా నటించి తన క్యూట్ నటనతో అందరినీ ఆకట్టుకున్న అనిల్ ఎస్తర్‌ ప్రస్తుతం మెయిన్ లీడ్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్దమవుతుంది.

Video Advertisement

మోహన లాల్ నటించిన దృశ్యంలో కూతురిగా అనిల్ ఎస్తర్ తన నటనతో అందరినీ మెప్పించింది.అందుకే ఆమెకు ఫిల్మ్ ఫేర్ నుండి క్రిటిక్స్ అవార్డ్  లభించింది. ఆ తర్వాత ఆ చిత్రం తెలుగు రీమేక్ లో వెంకటేష్ కూతురిగా నటించి తన నటనకు తెలుగు ప్రేక్షకుల చేత మంచి మార్కులు వేయించుకుంది.ఆ తర్వాత అడపాదడపా సినిమాలలో కనిపించిన ఎస్తర్ ఇప్పుడు తెలుగు చిత్రం జోహార్ లో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి తేజా మర్ని దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రాన్ని సందీప్‌ మర్ని ధర్మ సూర్య పిక్చర్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.ఇందులో ఎస్తర్‌ తో పాటు

అంకిత్ కొయ్య, నైనా గంగూలీ కీలక పాత్రలలో కలిసి నటిస్తున్నారు.ఈ చిత్రానికి ప్రియ దర్శన్‌ బాలసుబ్రమణియన్‌ సంగీతం అందిస్తున్నారు.ఈ చిత్రానికి జగదీశ్ చీకటి  సినిమాటోగ్రాఫర్ గా వ్యవరిస్తున్నారు.

బాల నటిగా సక్సెస్ అయిన ఈ ముద్దుగుమ్మ మరి ఈ చిత్రంతో మేయిన్ లీడ్ గా సక్సెస్ అవుతుందా?లేదా? అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.


End of Article

You may also like