పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్న తన 50వ జన్మదినాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు, అలాగే ఎంతో మంది సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ కి బర్త్ డే విషెస్ అందించారు. అలాగే పవన్ కళ్యాణ్ రాబోయే సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా అయినా భీమ్ల నాయక్ సినిమాలోని టైటిల్ సాంగ్ నిన్న విడుదల చేశారు.

dsp ramesh on bheemla nayak title song

ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఈ పాటపై వివాదాలు కూడా మొదలయ్యాయి. పాటలోని లిరిక్స్ పోలీసులను కించపరిచేలాగా ఉన్నాయి అన్నట్టు చాలా కామెంట్స్ వచ్చాయి. ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ ట్విట్టర్ వేదికగా ఈ పాటపై తన భావాన్ని చెప్పారు. రమేష్ ఈ విధంగా రాశారు. “థాంక్ ఫుల్లీ, తెలంగాణ పోలీసులు పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్. మాకు రక్షించడానికి డబ్బులు ఇచ్చే వారి ఎముకలు మేము విరగ్గొట్టము. ఆశ్చర్యంగా రామజోగయ్యశాస్త్రి కి పోలీస్ గొప్పతనం గురించి చెప్పడానికి తెలుగులో ఇంతకంటే మంచి మాటలు దొరకలేదు అనుకుంటా. పోలీస్ సర్వీస్ గురించి చెప్పనే లేదు. అని రాశారు.