Ads
పద్నాలుగేళ్ల వయసులో విలక్షణ నటుడి సరసన హీరోయిన్ గా ఫస్ట్ ఛాన్స్ కొట్టేసింది.. తొలిరోజు షూటింగ్ తోనే రిజెక్ట్ చేయబడింది..మరుసటి రోజు షూటింగ్ తన నటనకి పరీక్ష..అప్పుడు ఆ పరీక్షలో పాస్ కాకపోయుంటే అంతటి సూపర్ డూపర్ హిట్ చిత్రంలో కమల్ సరసన ఛాన్స్ మిస్ అయ్యేది..ఆ సినిమానే మరో చరిత్ర.. ఆ నటి సరిత…అప్పుడు సరిత వయసు 14ఏళ్లు. ఆ తర్వాత ఎంతో మంది సూపర్ స్టార్స్ పక్కన హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్ గా ఉన్న టైంలోనే డబ్బింగ్ వైపు వచ్చారు.ఎంతో మంది స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పారు..కానీ తన పాత్రకి డబ్బింగ్ విషయానికి వచ్చేసరికి ఒక చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు.
Video Advertisement
కమల్ హాసన్,రజినికాంత్,చిరంజీవి,రాజ్ కుమార్, మోహన్ లాల్ ఇలా సౌత్ ఇండియా సూపర్ స్టార్స్ అందరి సరసన నటించింది సరిత..బాలచందర్ దర్శకత్వంలో ఎక్కువ సినిమాల్లో నటించిన హీరో కమల్ అయితే..హీరోయిన్ సరితనే..స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్నప్పుడే డబ్బింగ్ వైపు అడుగుపెట్టింది.. తెరమీద కనపడే హీరోయిన్లు తెరవెనుక ఉండడానికి ఎక్కువగా ఇష్టపడరు…కానీ సరిత మాత్రం డబ్బింగ్ ని ఇష్టపడింది అందుకే ప్రేక్షకులకు మాత్రమే కాదు స్టార్ హీరోయిన్స్ కూడా తనే డబ్బింగ్ చెప్పాలని పట్టుబట్టేవాళ్లు..
సుహాసిని,విజయశాంతి,సౌందర్య,నగ్మ, టబు, ఊర్మిళ, నదియా,కుష్బూ ఒకరేమిటి ఎందరో హీరోయిన్లకు తన గాత్రాన్ని దానం చేశారు సరిత.. కోపం, బాద, సంతోషం, ఉత్సాహం ఇలా ఏ భావాన్నైనా తన గొంతులో అలవోకగా పలికించేయగలరు ..సౌందర్య,నగ్మ,విజయశాంతి లాంటి వాళ్లు ప్రత్యేకంగా సినిమాలు యాక్సెప్ట్ చేసేముందు డబ్బింగ్ చెప్పేది సరితే కదా అని కన్ఫామ్ చేసుకునేవారట..సరితా నువ్వెక్కడికయినా వెకేషన్ కి వెళ్లేది ఉంటే ముందుగా చెప్పి వెళ్లు అని విజయశాంతి అనేదంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆ జ్ణాపకాన్ని పంచుకున్నారు సరిత..
చేదు జ్ణాపకం..
ఇంతమంది హీరోయిన్లకు గాత్రాన్ని దానం చేసి వాళ్ల హవభావాలకు ప్లస్ అయిన సరితకు మాత్రం తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకునే విషయంలో ఒకసారి చేదు జ్ణాపకం ఎదురైందట.. మళయాళంలో ఒక సినిమా చేసేటప్పుడు తన పాత్రకి ఎవరో చెప్పిన డబ్బింగ్ నచ్చకపోవడంతో..తర్వాత సినిమాకు డబ్బింగ్ చెప్పాల్సిందిగా హీరోయిన్ శ్రీవిద్యను కోరారట సరిత..శ్రీవిద్య నాకు కుదరదంటూ రిజెక్ట్ చేసిందట..దాంతో చాలా ఫీలయ్యారట సరిత..
End of Article