Home News భార్య చున్నీ భర్త చావుకు కారణమైంది…కంటతడి పెట్టిస్తున్న సంఘటన.!

భార్య చున్నీ భర్త చావుకు కారణమైంది…కంటతడి పెట్టిస్తున్న సంఘటన.!

by Mohana Priya

కర్ణాటకలో ఇటీవల చోటు చేసుకున్న ఒక ఆక్సిడెంట్ చర్చలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని, యాదగిరి జిల్లా, సరుపుర తాలూకా చిక్కనహళ్లికి చెందిన మౌనేశ్వప్ప తన భార్య రాయమ్మతో కలిసి మండ్య జిల్లాలోని సావందిపుర గ్రామంలో నివాసం ఉంటున్నాడు. మౌనేశ్వప్ప జెసిబి డ్రైవర్ గా పని చేస్తున్నారు. రాయమ్మ గర్భవతిగా ఉన్నారు.

dupatta stuck in bike tire

ఈ క్రమంలో మౌనేశ్వప్ప వైద్య పరీక్షల కోసం భార్యను హలగూరు ఆసుపత్రికి తీసుకువెళ్లి, తీసుకువస్తూ ఉండేవారు. శనివారం వైద్య పరీక్షల కోసం తన భార్యను బైక్ పై ఎక్కించుకుని హాస్పిటల్ కి వెళ్తున్నారు మౌనేశ్వప్ప. బైక్ పై కూర్చున్న రాయమ్మ చున్నీ వెనుకకు పడిపోయింది. ఈ విషయాన్ని వారిద్దరూ గమనించలేదు. కొద్ది దూరం వెళ్ళాక ఇంటికి వెళ్లే క్రమంలో ఆమె చున్నీ బైక్ వెనక చక్రానికి చుట్టుకుంది.

dupatta stuck in bike tire

దాంతో బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో రాయమ్మ బైక్ పై నుండి కింద పడి స్వల్పగాయాలతో బయటపడ్డారు. కానీ మౌనేశ్వప్ప మాత్రం తీవ్ర గాయాలు అయ్యాయి. తల చెట్టుకు తగిలి బలమైన గాయం అవడంతో రక్తస్రావం అయ్యింది. ఈ ఘటనలో మౌనేశ్వప్ప ఘటనా స్థలంలో ప్రాణాలు విడిచారు. తన నిర్లక్ష్యమే భర్త ప్రాణం తీసింది అంటూ రాయమ్మ బాధపడిన తీరు స్థానికులను కలచివేసింది. ఈ ఘటనపై హలగూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

You may also like