ఓ వైపు కరోనా మహమ్మారి భయంతో ప్రజలు గజగజ వణికిపోతుంటే మరో వైపు ప్రకృతి భయబ్రాంతులకు గురిచేస్తోంది. తుఫాన్,గ్యాస్ లీకేజీ,ఎండలు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతుంటే మరో వైపు మీదతలు వల్ల రోజు రోజు కి పంటలు అన్ని చేజారిపోతున్నాయి.ఈ క్రమంలోనే ఢిల్లీలో పలుచోట్ల భూమి కంపించింది.డిల్లీ తో పాటు నోయిడా, గురుగ్రామ్‌ను పంజాబ్‌లోని ఉత్తర ప్రదేశ్‌లో కూడా ప్రకంపనలు సంభవించాయి.
Video Advertisement
రిక్టార్ స్కేల్‌పై 4.6 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ పేర్కొంది. ఇదిలా ఉంటే గత నెలలో కూడా రెండు సార్లు భూకంపం సంభవించింది. నెల వ్యవధిలోనే నాలుగు సార్లు భూ ప్రకంపనలు సంభవించింది. లాక్ డౌన్ సమయంలో ఇది ఐదో సారి కావడంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.