Ads
కాళ్ల పారాణి ఆరకముందే ఒక నవవధువు సూసైడ్ చేసుకుంది. తూర్పు గోదావరి లో జరిగిన ఈ ఘటన అందరినీ విస్తుపోయేలా చేస్తుంది.
Video Advertisement
వివరాలలోకి వెళ్తే మండపేట మండలం ఏడిదసీతానగరంకు చెందిన రమ్యశ్రీ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. తల్లిదండ్రులు తనకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు.అందుకు రమ్య తన ఉన్నత చదువులు చదవాలనుకుంటున్నట్లు తల్లిదండ్రులకు తెలిపింది.కాని రమ్యకు చెల్లి ఉంది.ఇద్దరి పెళ్లిళ్లు ఒకేసారి చేయాలంటే భారం అవుతుందని భావించిన తల్లిదండ్రులు ఆమెకు తమ సమస్యలను వివరించి ఆమెను ఒప్పించి తన మేనమామతో ఆమెకు వివాహం చేయించారు.
రమ్యశ్రీ అప్పట్లో ఓ షార్ట్ ఫిల్మ్ లో కూడా నటించింది.చదువుకుంటూ షార్ట్ ఫిల్మ్స్ లో నటించాలని రమ్యశ్రీ కలలు కంటూ ఉండేది. ఇక తాజాగా తనకు పెళ్లి అయినందున ఇక తను చదవడానికి తనకి ఇంట్రెస్ట్ ఉన్న షార్ట్ ఫిలిమ్స్ లో చేయడానికి వీలు పడదని భావించి మనస్థాపం చెంది పురుగుల మందు తాగింది.విషయం తెలిసిన కుటుంబసభ్యులు హుటాహుటిన తనని ఆస్పత్రికి తరలించారు.కాని ఆమె అప్పటికే మృతి చెందింది.
End of Article