నాలుగేళ్ల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదలైన డ్రగ్స్ వివాదం మళ్లీ బయటికి వచ్చింది. ఈ విషయంలో ఈడీ పలువురు ప్రముఖ సినీ సెలబ్రిటీలకి నోటీసులు జారీ చేసింది. వారిలో రకుల్ ప్రీత్ సింగ్, రవితేజ, ఛార్మి, నవదీప్, ముమైత్ ఖాన్, నందు, తరుణ్, రానా దగ్గుబాటి, పూరి జగన్నాథ్ ఉన్నారు. 4 సంవత్సరాల క్రితం ఈ విషయంపై చాలా చర్చలు జరిగాయి.

ed notice to celebrities

కొంత మంది సినీ ప్రముఖులని ఈ విషయంపై నార్కోటిక్స్ విభాగం వాళ్ళు ఆఫీస్ కి పిలిచి విచారించడం అప్పట్లో ఒక సెన్సేషన్ అయ్యింది. ఈ కేసులో ఎక్సైజ్ పోలీసులు మొత్తం 12 కేసులు నమోదు చేసి 30 మందికి పైగా అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు మాత్రం ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 22 వరకు ఈ విచారణ జరుగుతుంది అని సమాచారం.