Ads
అల్లు అర్జున్‌కి కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా వేరే సినిమా ఇండస్ట్రీలలో కూడా క్రేజ్ వచ్చింది. అందుకు కారణం పుష్ప. ఈ సినిమా తెలుగులో మాత్రమే కాకుండా ఇంత భాషల్లో కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయ్యక సినిమాకి ఇంకా మంచి రెస్పాన్స్ వస్తోంది.
Video Advertisement
పుష్ప సినిమా ద్వారా కేవలం సౌత్‌లో మాత్రమే కాకుండా నార్త్‌లో కూడా అల్లు అర్జున్ చాలా పాపులర్ అయ్యారు. అంతకు ముందు నుండి అల్లు అర్జున్ చాలా ఫేమస్. కానీ పుష్పతో నార్త్‌లో కూడా అల్లు అర్జున్ ఒక ఇమేజ్ సంపాదించారు. ఎంతో మంది ప్రముఖులు సినిమా చూసి, సినిమా చాలా బాగుంది అని, అల్లు అర్జున్ ఈ సినిమాలో చాలా బాగా నటించారు అని సోషల్ మీడియా ద్వారా పొగుడుతున్నారు.
ఇదిలా ఉండగా అల్లు అర్జున్ ఇటీవల జొమాటోకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. జొమాటోకి అల్లు అర్జున్ చేసిన ఎడ్వర్టైజ్మెంట్ ఇటీవల విడుదల చేయబడింది. ఈ ఎడ్వర్టైజ్‌మెంట్‌లో అల్లు అర్జున్‌తో పాటు నటుడు సుబ్బరాజు కూడా ఉన్నారు. ఇందులో ఒక ఫైట్ సీన్ షూట్ చేస్తుంటారు. అప్పుడు సుబ్బరాజు “బన్నీ కొంచెం తొందరగా కిందకి దించవా ఆకలేస్తోంది” అని అంటారు. అందుకే అల్లు అర్జున్, “సౌత్ సినిమా కదా, కొంచెం ఎక్కువ గాల్లో ఉండాలి” అని అంటారు.
అయితే, అల్లు అర్జున్ అంతకుముందు నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. “సౌత్, నార్త్ అనే తేడా లేదు. మొత్తం ఇండియానే” అని అల్లు అర్జున్ అంటారు. కానీ ఈ ప్రకటనలో మాత్రం సౌత్ సినిమా అని అన్నారు. అలాగే అల్లు అర్జున్ హీరోగా నటించిన రేసు గుర్రం సినిమాలో కూడా ఒక పాటలో సౌత్ ఇండియన్ అని ఉంటుంది. దాంతో అల్లు అర్జున్ రూల్స్ చెప్తారు కానీ ఫాలో అవ్వరు అంటూ ఎడిట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
watch video:
End of Article