Ads
అప్పుడెప్పుడో ఒక స్కూటీ యాడ్ లో అబ్బాయిలకు మాత్రమే ఎందుకు అంత ఫన్ అని వచ్చింది గుర్తుందా? ఆ యాడ్ ఈ అమ్మాయికి బాగా ఇష్టం అనుకుంట. స్కూటీతో వింత స్టంట్ లు చేసింది. కాకపోతే అది స్టంట్ నేర్చుకుని చేసింది కాదు. స్కూటీ నడపడం రాక చేసింది. అబ్బాయిలకు బైక్ నడపడం ఎంత ఇష్టమో అమ్మాయిలకు స్కూటీ నడపడం కూడా అంతే ఇష్టము. కాకపోతే బ్రేక్ కంటే తమ కాళ్ళని ఎక్కువ వాడుతుంటారు స్కూటీ ని ఆపడానికి. ఇది అందరి గురించి కాదండోయి. రోడ్డు మీద నేను చూసిన కొందరి గురించి మాత్రమే.
Video Advertisement
https://youtu.be/Z_XjlQ82mgc
అమ్మాయిలు కొంత మంది ఎంతో అలవోకగా బులెట్ బైక్ లు కూడా నడిపిస్తున్నారు. మనం మాట్లాడుకునేది వారి గురించి కాదు. ఎలా నడపాలో తెలీకుండా మనకి రోడ్ల మీద స్కూటీ నడుపుతూ కనిపించే అమ్మాయిల గురించి. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది. స్కూటీ నడపాలని చూసిన అమ్మాయి నడపం రాక కింద పడిపోయింది. ఆ వీడియో చూసి ఎంతో మంది నవ్వుకుంటున్నారు. మీరు ఓ లుక్ వేయండి. దయచేసి స్కూటీ నడిపేటప్పుడు నేర్చుకుని జాగ్రత్తగా నడపండి.
గతంలో రోడ్ మీద ఇలాగె ఓ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది…మలక్ పేట్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర తన స్కూటీని ఆన్ లోనే ఉంచి నిల్చుంది. వేగంగా వచ్చిన చాలా మంది ఆమె వెనుకాలే సడెన్ బ్రేక్ వేస్తూ ఆగిపోయారు…. అంతా అయోమయంగా ఉంది. ఏంటా అని సందుల్లోంచి సందుల్లోంచి కార్లను తప్పించుకుంటూ నేను నా బైక్ మీద ఆ అమ్మాయి దగ్గరికెళ్లా..! అందరూ ఆమెనే అడుగుతున్నారు… ? ఎందుకు ఆగారు? ఏమయ్యింది. సిగ్నల్ కూడా లేదు కదా అని.!
దానికి ఆమె చెప్పిన సమాధానం….పైన రైలు వెళుతుంది. ఇప్పుడు మనం ఆ బ్రిడ్జ్ ను దాటుకుంటూ వెళ్లాలి. ఆ టైమ్ లో ట్రైన్ నుండి వన్..టూ లాంటివి మీద పడితే…ఛీ..ఛీ మళ్లీ నేను ఇంటికెళ్లి రెడీ అయి ఆఫీస్ కు వెళ్లాలి…సో రిస్క్ అంటూ సెలవిచ్చింది ఆ మేడమ్….ఇంతలో పక్కకున్న ఓ 50 ఏళ్ల పెద్ద మనిషి…. నీ మొహం మండ…పైన వెళ్లేది లోకల్ ట్రైనే.! అంటూ గేర్ మార్చుకొని వెళ్లిపోయాడు. ఆమె పక్కకున్నోళ్లంతా పగలబడి నవ్వుకున్నారు. నాతో సహా. ( లోకల్ ట్రైన్ లో టాయిలెట్స్ ఉండవు)
End of Article