“ఈ నగరానికి ఏమైంది”..! అప్పుడు వచ్చింది ఎంత … ఇప్పుడు ఎంత..?

“ఈ నగరానికి ఏమైంది”..! అప్పుడు వచ్చింది ఎంత … ఇప్పుడు ఎంత..?

by kavitha

Ads

యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్న చిత్రాలలో ‘ఈ నగరానికి ఏమైంది’ మూవీ కూడా ఒకటి. ఇది తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సెకండ్ మూవీ. మొదటి సినిమా పెళ్లి చూపులు మూవీతో అందుకున్న తరువాత తరుణ్ భాస్కర్ ఈ మూవీని తెరకెక్కించారు.

Video Advertisement

అయితే ఈ మూవీ విడుదల అయినపుడు పెద్ద విజయాన్ని సాధించలేదు. కానీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే బుల్లితెర పై, ఓటీటీలో ఈ చిత్రం హిట్ అయ్యింది. ఈ మూవీని తాజాగా రీ రీలీజ్ చేశారు. అయితే రిలీజ్ లో ఎంత కలెక్ట్ చేసిందో, రీ రీలీజ్ లో ఎంత కలెక్ట్ చేసిందో  ఇప్పుడు చూద్దాం..
Ee-nagaraniki-emaindiఈ చిత్రంతో విశ్వక్ సేన్ హీరోగా గుర్తింపును పొందాడు. ఈ మూవీ తరువాత విశ్వక్ ‘మాస్ కా దాస్’ గా మారారు. ఈ చిత్ర డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అటు దర్శకుడిగా, ఇటు నటుడిగా రెండిటిలోనూ రాణిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ సమయంలో మొదటి రోజు 70 లక్షలు మాత్రమే కలెక్షన్ రాబట్టింది. ఇక ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం రీ రీలీజ్ మాత్రం రికార్డ్ సృష్టించింది. ఈ మూవీ రీ రీలీజ్ కోసం యూత్ చాలా ఆసక్తితో ఎదురుచూశారు.ఇక ఈ సినిమా రీ రిలీజ్ లో భారీ వసూళ్లను సొంతం చేసుకుందని సమాచారం. ‘ఈ నగరానికి ఏమైంది’ మూవీ మొదటి రోజే కోటి డెబ్బై లక్షల రూపాయల గ్రాస్ ను కలెక్ట్ చేసి, రికార్డ్ సృష్టించింది. దాంతో ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా పెద్ద చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది.ఈ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు పోకిరి, ఒక్కడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు  ఖుషి, జల్సా , మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ ఆరెంజ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ దేశముదురు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ సింహాద్రి లాంటి చిత్రాల పక్కన చోటు సంపాదించుకుంది.

Also Read: మెగా ప్రిన్సెస్‌ కు రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఖరీదైన గిఫ్ట్‌..! ఏమిటో తెలుసా..?

 


End of Article

You may also like