Ads
తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా మన లోగిళ్లలోకి సరికొత్త సంతోషాలు రావాలని, కుటుంబమంతా ఆనందోత్సావంతో ఉండాలని కోరుకుంటూ ఈటీవీ సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ‘ఈ పండగ మనదే’ అనే కార్యక్రమాని మనకు అందించింది. దానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్‌తో చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇదే కార్యక్రమంలో అగ్ర నిర్మాత దిల్ రాజు సైతం పాల్గొన్నారు.
Video Advertisement
అంతే కాదండోయ్ సూపర్ హిట్ ఫిల్మ్, సూపర్ హిట్ ఓటీటీ సిరీస్ టీమ్స్‌ను ఓకే వేదికపైకి తీసుకొచ్చి అల్లరల్లరి చేయించారు. అందులో భాగంగా బలగం సినిమా నుంచి దర్శకుడు వేణు అండ్ టీమ్.. 90’స్ వెబ్ సిరీస్ నుంచి నటుడు శివాజీ అండ్ టీమ్ పాల్గొన్నారు. ఉగాది పచ్చడి షడ్రులతో ఎలా ఇంపుగా అనిపిస్తుందో అలాగే ఈ కొత్త సంవత్సరం ప్రేక్షకులకు అంతా మంచే జరగాలని వారు కోరుకున్నారు.
ఇక ఈ కార్యక్రమంలోకి సుడిగాలి సుధీర్ రావటం విశేషం. తెలుగు టెలివిజన్ సూపర్ స్టార్ కమ్ బ్యాక్ అనేది ఆయన అభిమానుల్లోనే కాదు, బుల్లి తెర ప్రేక్షకుల్లోనూ ఓ నూతనోత్సాహాన్ని నింపింది. ఈ సరదా కార్యక్రమం ‘ఈ పండగ మనదే’ ను అసాంతం ఎంజాయ్ చేయాలంటే ఈటీవీని ట్యూన్ చేయాల్సిందే. ఈ కార్యక్రమం ఉగాది సందర్భంగా ఏప్రిల్ 9న ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రసారం కానుంది.
watch video:
End of Article