ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థిపై గెలిచిన ఓ రోజు కూలి…ఇది కదా గెలుపంటే.?

ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థిపై గెలిచిన ఓ రోజు కూలి…ఇది కదా గెలుపంటే.?

by Mounika Singaluri

Ads

తాజాగా ఛత్తీస్‌గఢ్ లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు ఐదేళ్ల తర్వాత తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. కానీ ఛత్తీస్‌గఢ్ విజయం సాధిస్తామని ఆత్మవిశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ కు ఊహించని షాక్ ఎదురైంది. దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్ కాంగ్రెస్‌కు అధికారం దక్కుతుందని అంచనా వేశాయి. కానీ ఫలితాలు మాత్రం తారుమారయ్యాయి. హస్తం పార్టీ నుంచి బరిలో నిలిచిన డిప్యూటీ సీఎం సహా పలువురు ప్రముఖులు పరాజయం చవిచూశారు. అంతే కాకుండా ఒక అనామకుడి చేతిలో ఏడుసార్లు ఎమ్మెల్యే, మంత్రి ఓడిపోవడం ఆశ్చర్య పోవాల్సిన విషయం.

Video Advertisement

ఆ సామాన్యుడి విజయం రాజకీయ వర్గాల్లో మరో సంచలనం సృష్టించింది. అయితే కొడుకును అలర్లి మూకలు పొట్టనబెట్టుకోవడంతో న్యాయం కోసం రోజు కూలీ అయిన ఈశ్వర్ సాహు పోరాటం చేశారు. తనకు న్యాయం దొరక్కపోవడంతో కడుపు మండి ఎన్నికల బరిలో దిగారు. అతడికి బీజేపీ టిక్కెట్ ఇవ్వడంతో ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి రవీంద్ర చౌబే పై విజయం సాధించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. అలాగే ఎమ్మెల్యే గా ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ లో అడుగుపెట్టి పెను సంచలనం సృష్టించారు. సాజా నియోజకవర్గం నుంచి ఈశ్వర్ సాహు 5,196 ఓట్ల మెజార్టీతో గెలుపొంది జెయింట్ కిల్లర్‌గా నిలిచారు. ఈ ఎన్నికల్లో సాహుకు 1,01,789 ఓట్లు, కాంగ్రెస్ మంత్రి రవీంద్ర చౌబేకు 96,593 ఓట్లు వచ్చాయి.

అయితే 2013 అసెంబ్లీ ఎన్నికల తప్ప 1985 నుంచి సాజా నియోజకవర్గం నుంచి చౌబే గెలుపొందుతూ వచ్చారు. భూపేశ్ బఘేల్ క్యాబినెట్‌లో శాసనసభ వ్యవహారల శాఖ మంత్రిగా పనిచేసిన రవీంద్ర చౌబే 2009 నుంచి 2013 వరకూ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇక, ఎన్నికల ప్రచారంలో మంత్రి చౌబేపై పదే పదే ఎదురుదాడి చేసిన ఈశ్వర్ సాహు ప్రజాప్రతినిధిగా ఆయన తన కర్తవ్యాన్ని పూర్తిగా నిర్వర్తించలేకపోయారని దుయ్యబట్టారు. అలాగే తన కొడుకును చంపిన హం-తకులకు కొమ్ము కాశారని ఆరోపించారు.

కాగా, ఈశ్వర్ సాహు కుమారుడు భువనేశ్వర్ సాహు ఈ ఏడాది ఏప్రిల్‌లో బెమెతార జిల్లా బిరాన్‌ పూర్ గ్రామంలో జరిగిన మతఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయాడు. వేర్వేరు కమ్యూనిటీలకు చెందిన ఇద్దరు విద్యార్థుల మధ్య సైకిల్ ఢీకొట్టిన విషయంలో జరిగిన గొడవ రెండు వర్గాల మధ్య ఘర్షణగా మారిపోయింది. ఇది క్రమంగా ఆ ప్రాంతంలో మత ఘర్షణకు దారితీసింది. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల చేతుల్లో సాహు హ-త్యకు గురయ్యాడు. అతడ్ని ఇంటి నుంచి లాక్కెళ్లి అతి దారుణంగా క-త్తులతో పొ-డిచి చంపారు.


End of Article

You may also like