ఎలక్ట్రిక్ వాహనాలు ఇలా ఎందుకు దగ్ధం అవుతున్నాయి..? DRDO రిపోర్టులో ఏముందంటే..?

ఎలక్ట్రిక్ వాహనాలు ఇలా ఎందుకు దగ్ధం అవుతున్నాయి..? DRDO రిపోర్టులో ఏముందంటే..?

by Sunku Sravan

Ads

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పొల్యూషన్ తగ్గించడం కోసం ప్రభుత్వాలు అనేక నిబంధనలు తీసుకొస్తున్నాయి. ఈ తరుణంలో డీజిల్, పెట్రోల్ వాహనాలు వాడితే పొగ ద్వారా వాతావరణం కలుషితం అవుతోందని భావించి ఎలక్ట్రికల్ వాహనాలు వాడకాన్ని పెంచాలని ఆదేశాలు జారీ చేసింది.

Video Advertisement

ఈ తరుణంలో ఎలక్ట్రికల్ కంపెనీలకు పర్మిషన్ లు ఇచ్చి వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడం వల్ల వాహనదారులు కూడా ఎలక్ట్రికల్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.

ఈ వాహనానికి రిజిస్ట్రేషన్, సబ్సిడీ ఫ్రీగా కేంద్రం అందిస్తూ ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో ఎడాపెడా ఎలక్ట్రికల్ వాహనాలు కొనేస్తున్నారు. రోజుకో మోడల్ చొప్పున వివిధ రకాల కంపెనీలు మార్కెట్లోకి ఈ ఎలక్ట్రికల్ మోటార్ సైకిళ్లను తీసుకొస్తున్నాయి. ఇక మన హైదరాబాద్ నగరంలో సుమారుగా 5 నుంచి 6 కంపెనీలు వాహనాలను తయారు చేస్తూ ఉన్నాయి.

ఇక్కడే మొదలైంది అసలు బాధ. ఇప్పటివరకు ఈ వాహనాలు కొనుగోలు చేసిన వాటిలో చాలా వాహనాలు కాలిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఎలక్ట్రికల్ మోటార్ వాహనాల్లో ఒక్కసారిగా మంటలు రావడం, ఛార్జింగ్ పెడుతున్న సమయంలో బ్యాటరీలు పేలడం వంటి ఘటనలు మనం అనేకం చూస్తూనే ఉన్నాం. ఈ ఘటన జరిగి చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.

 

దీంతో దేశంలో ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలు మాత్రం తగ్గుముఖం పట్టాయని చెప్పవచ్చు. వరుసగా ఈ వాహనాల్లో మంటలు వ్యాపించి దగ్ధం కావడం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా వీటిని సీరియస్ గా తీసుకుంది. దీంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు. డిఆర్ డిఓ ( భారత రక్షణ పరిశోధన సంస్థ) అసలు ఈ వాహనాల్లో మంటలు ఎందుకు వ్యాపిస్తున్నాయి అనే అంశం మీద విచారణ చేపట్టింది.

ఈ విచారణలో చాలా ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఎలక్ట్రికల్ వాహనాల వినియోగంలో మంటలు వ్యాపించడానికి ప్రధానకారణం బ్యాటరీ లో లోపాలు అని వారు నివేదికలో తెలియజేశారు. ఆ లోపం వల్లనే ఛార్జింగ్ పెట్టే సమయంలో బ్యాటరీలు పేలడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు అన్నారు.


End of Article

You may also like