పటాసులు కూర్చిన పైనాపిల్ తిన్న గర్భస్త ఏనుగు మతి దేశవ్యప్తంగా సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే.. అయితే ఆ ఘటనకు సంబంధించి రోజుకోక కొత్త విషయం వెలుగులోకి వస్తుంది.. నోటిలో పటాకులు పేలి, దవడ భాగం కాలిపోవడంతో పది రోజుల పాటు ఎటువంటి ఆహారం తీసుకోకుండా నీరసించి..చివరకు నీటిలో మునిగి చనిపోయిందని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వెల్లడయింది..తాజాగా ఏనుగు తిన్నది పైనాపిల్ కాదు.. కొబ్బరికాయ అని వెల్లడించారు అటవిశాఖ అధికారి సునీల్ కుమార్.

Video Advertisement

ఏనుగు మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..ముగ్గురు అనుమానితులను గుర్తించారు..వారిలో ఒకరిని అరెస్ట్ చేశారు..అరెస్టు చేసిన నలభైఏళ్ల విల్సన్ ని విచారించగా..అతను  రబ్బరు సేకరిస్తుంటాడని, స్థానికంగా మరొక  ఇద్దరితో కలిసి  పేలుడుపర్దాలు తయారు చేస్తుంటామని చెప్పుకొచ్చాడు. విల్సన్ తో పాటు పేలుడు పదార్దాలు తయారు చేసినవారిని వెతికే  పనిలో ఉన్నారు పోలీసులు.పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు.

అడవి పందులు , ఇతర క్రూరమైన అడవి జంతువుల నుంచి తమ పంటలను రక్షించుకునేందుకు స్థానిక  రైతులు  టపాకాయలు తయారు చేసి పండ్లు, జంతువుల కొవ్వులో నింపి ఆ జంతువులకు  ఉచ్చులుగా పెడతారు..అలా ఒక అడవి పంది కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో పొరపాటున ఏనుగు బలి అయిపోయింది.  ఘటనపై పూర్తి విచారణ చేస్తామని, దోషులను కఠినంగా శిక్షిస్తామని కేరళ ముఖ్యమంత్రి విజయన్ ప్రకటించారు.. ఘటన జరిగింది మలప్పురం లో కాదు.. పాలక్కాడ్ లో అని సమాచారం..