ట్విట్టర్ కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్.. సిఈఓ పరాగ్ భార్య ఆశ్చర్యపోయే ట్విస్ట్.. ఏంటంటే..?

ట్విట్టర్ కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్.. సిఈఓ పరాగ్ భార్య ఆశ్చర్యపోయే ట్విస్ట్.. ఏంటంటే..?

by Sunku Sravan

Ads

అమెరికన్ బిజినెస్ దిగ్గజం ఎలన్ మస్క్ గురించి తెలియని వారుండరు. ఆయన ట్విట్టర్ కొనుగోలు చేసిన విషయంపై ప్రతి ఒక్క సీన్ సినిమా క్లైమాక్స్ సీన్ లా కనిపిస్తోంది. ట్విట్టర్ లో అధిక భాగాన్ని కొనుగోలు చేయడం నుంచి ఆ సంస్థ యొక్క సీఈవో పరాగ్ అగర్వాల్ ను తొలగించడం వరకు ఇలా ప్రతి ఒక్క సందర్భం వ్యాపార దిగ్గజాలలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

Video Advertisement

ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా అదిరిపోయే ట్విస్ట్ చోటుచేసుకున్నది. దాదాపుగా 44 మిలియన్ డాలర్లతో ఎలన్ మస్క్ ట్విట్టర్ ను తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ యొక్క ట్విట్టర్ కొనుగోలులో .. ట్విటర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ ఆయన భార్య వినీత్ అగర్వాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు పలు నివేదికలు తెలియజేస్తున్నాయి.. అది ఎలాగో చూడండి..!!కాలిఫోర్నియాలోని మెన్ లో పార్కు కేంద్రముగా ఆండ్రీ సీన్ హోరోవీడ్జ్ అనే వెంచర్ క్యాపిటలిస్టులో(VC) గా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇప్పటి వరకే మెటకు ఎక్కువ మొత్తంలో హోరోవీడ్జ్ పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం అదే సంస్థ.. ట్విట్టర్ ను కూడా కవర్ చేయడం కోసం ఎలాన్ మాస్క్ 400 మిలియన్లు డాలర్ల పెట్టుబడి పెట్టడం కోసం అంగీకారం తెలిపింది.

ఈ పెట్టుబడుల అంశం మీద వినీత అగర్వాల్ పాత్ర ఎక్కువగా ఉన్నట్టు కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఆండ్రీ సినుకు వినీత అగర్వాల్ జనరల్ పార్ట్నర్ గా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతోపాటుగా లైఫ్ సైన్సెస్ టూల్స్, డిజిటల్ హెల్త్, డ్రగ్ డెవలప్మెంట్, రోగుల సంరక్షణ కోసం ప్రత్యేకమైన డేటా సెట్లు లాంటి హెల్త్కేర్ విభాగంలో పెట్టుబడులు పెట్టడం కోసం ముఖ్య పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం ఎలాన్ మస్క్ ట్విటర్ ను కొనుగోలు చేయడం వల్ల ఆండ్రీ సీన్ ఆర్థికంగా సహాయం చేస్తుండటం, అలాగే ఆ సంస్థకు జనరల్ పార్ట్నర్ గా అగర్వాల్ ఉండడం వల్ల ఈ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ట్విట్టర్ కొనుగోలు చేయడం కొరకు ఎలాన్ మాస్క్ కు సాయం చేయడం వల్ల వినీత అగర్వాల్ వార్తల్లో నిలుస్తున్నారని చెప్పవచ్చు.


End of Article

You may also like