ఆ ఒక్క ట్వీట్ వల్ల…లక్ష కోట్లు నష్టం..! ఇంతకీ అతనెవరు?

ఆ ఒక్క ట్వీట్ వల్ల…లక్ష కోట్లు నష్టం..! ఇంతకీ అతనెవరు?

by Megha Varna

Ads

కరోనా వైరస్ కారణంగా దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి .ఇటువంటి సమయంలో స్పేస్ ఎక్స్ సీఈఓ ,టెస్లా వ్యవస్థాపకుడు ఏలన్ మాస్క్ పోస్ట్ చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియా లో టాప్ ట్రేండింగ్ టాపిక్ గా మారింది.

Video Advertisement

తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ‘టెస్లా స్టాక్ ధర చాల ఎక్కువ ” అంటూ ట్వీట్ చేసారు.అంతేగాక తన ఇళ్లుతో సహా తన మిగతా ఆస్తులన్నీ అమ్మేస్తానని తెలిపారు.ఈ ఒక్క ట్వీట్ దెబ్బకు స్టాక్ మార్కెట్ లో టెస్లా కంపెనీ మార్కెట్ వ్యాల్యూ ఏకంగా 14 బిలియన్ డాలర్లు అంటే సుమారు లక్ష కోట్ల రూపాయలకు పైనే ఆవిరి అయిపోయింది .దీంతో ఎలాన్ మాస్క్ తన చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదివికి కూడా దూరం అయ్యేలా చేసుకున్నాడు.టెస్లా మార్కెట్ వ్యాల్యూ 141 బిలియన్ డాలర్లు కాగా ,ఎలాన్ మాస్క్ ట్వీట్ ప్రభావం వలన 127 బిలియన్ డాలర్లకు పడిపోయింది .ఓ ఫాలోవర్ అయితే డబ్బులు అవసరమై ఇలా అమ్మకానికి పెడుతున్నారా ? లేక ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కు నిరనసనగా ఇలా చేస్తున్నారా ? అని ప్రశ్నించారు.దీనిపై ఎలాన్ మాస్క్ స్పందిస్తూ …డబ్బు అవసరం లేదు ..అంగారకుడిపై ,భూమికి నన్ను నేను అంకితం చేసుకుంటున్నాను ..ఆస్తులు కలిగి ఉండడం భారమే తప్ప ఏమి కాదు ..అని తెలిపారు .

ఈ విషయం ఇలా  ఉంచితే 2018 లో సైతం ఎలాన్ మాస్క్ ఇలాంటి తుంటరి ట్వీట్ వలన చైర్మన్ పదివి వదులుకోవాల్సి వచ్చింది.అప్పట్లో టెస్లా కంపెనీ స్టాక్ మార్కెట్ నుండి తప్పుకుంటుందని ,ప్రైవేట్ యాజమాన్య సంస్థగా మారుతుందని ట్వీట్ చేసారు.అంతేకాకుండా దానికి కావాల్సిన వనరులు కూడా సమకూర్చినట్లు వెల్లడించాడు .దీంతో ఒక్కసారిగా కంపెనీ షేర్ల విలువ పెరిగింది .. ఎలాన్ మాస్క్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని యూఎస్ (sec ) వెల్లడించడంతో అమాంతం షేర్ల విలువ పడిపోయాయి ..ఈ ట్వీట్ కారణంగా మాస్క్ చైర్మన్ పదవి నుండి తప్పుకోవాల్సి వచ్చింది ..

గతంలో గంజాయి పిలుస్తూ ఓ పాడ్ కాస్ట్ ను ఎలాన్ విడుదల చేసాడు ..ఎలాన్ విడుదల చేసిన ఆ వీడియో కారణంగా షేర్ల విలువ 9 శాతం పడిపోయింది . మాస్క్ కంపెనీ సెక్యూరిటీలకు సంబంధించి కంపెనీ గురించి ఏ వార్త అయినా   ట్వీట్ చెయ్యాలంటే ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ..కానీ ఇలాంటివి ఏమి పట్టించుకోకుండా ఎలాన్ మాస్క్ ఇన్వెస్టర్లను నిట్టనిలువనా ముంచేస్తున్నాడు .


End of Article

You may also like