ఆగస్ట్ నుండి అమలులోకి రానున్న కొత్త బ్యాంకింగ్ రూల్స్..! ఏం మారబోతున్నాయి అంటే.?

ఆగస్ట్ నుండి అమలులోకి రానున్న కొత్త బ్యాంకింగ్ రూల్స్..! ఏం మారబోతున్నాయి అంటే.?

by Mohana Priya

Ads

బ్యాంక్ సంబంధిత లావాదేవీలకు సంబంధించిన కొత్త నిబంధనలు ఆగస్ట్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ నిబంధనలలో, ఆర్బిఐ మార్పులు చేయడం వల్ల, సెలవు రోజుల్లో కూడా విద్యుత్, గ్యాస్, టెలిఫోన్, నీరు, మ్యూచువల్ ఫండ్స్, జీతం, పెన్షన్ సంబంధిత లావాదేవీలు జరుగుతాయి. రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్, ఎన్ఏసిహెచ్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి.new atm rules for august 2021

Video Advertisement

# జూన్ నెలలో ఆర్బిఐ తీసుకొచ్చిన ఇంకొక నిబంధన ప్రకారం, ఆగస్ట్ 1 నుండి ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్, అంటే ఏటీఎం చార్జీలు పెరగబోతున్నాయి. ఏటీఎం కేంద్రాల నిర్వహణ భారంగా మారింది అనే ఆందోళన కారణంగా, ఆర్బిఐ 2 రూపాయల ఇంటర్ చేంజ్ ఫీజ్ పెంచేందుకు అవకాశం కల్పించింది. ఒక్కో ఆర్థిక లావాదేవీలపై 15-17 రూపాయల వరకు, ఆర్థికేతర లావాదేవీలపై 5-6 రూపాయలకు ఛార్జ్ పెరిగబోతోంది.

new atm rules for august 2021

# ఇప్పటి వరకు ఉచితంగా అందిస్తున్న ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ డోర్ స్టెప్ సేవలు ఇకపై డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఆగస్ట్ నుంచి ఐపీపీబీ డోర్ స్టెప్ అభ్యర్థనకు బ్యాంకింగ్ చార్జీలు కింద, ప్రతి కస్టమర్ 20 రూపాయలు దాంతో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకే కస్టమర్ ఎక్కువ సార్లు అభ్యర్ధన చేయడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు.new atm rules for august 2021

# భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసిఐసిఐ తమ దేశీయ పొదుపు ఖాతాదారులకు డబ్బుకు సంబంధించిన లావాదేవీలు, ఏటీఎం ఇంటర్ చేంజ్, చెక్ బుక్ లావాదేవీల చార్జీలు సవరించారు. ప్రతి ఆర్థిక లావాదేవీ కి 20 రూపాయలు, ఆర్థికేతర లావాదేవీ కి 8.5 రూపాయల చార్జీలు వసూలు చేస్తుంది.new atm rules for august 2021

ఆగస్ట్ 1 నుండి ఐసిఐసిఐ బ్యాంక్ ఖాతాదారుల హోమ్ బ్రాంచ్ లో నగదు లావాదేవీ పరిమితి నెలకు లక్ష రూపాయల వరకు ఉచితం. లక్షకు పైగా చేసే ప్రతి లావాదేవీపై ప్రతి 1000 రూపాయలకు, 5 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 150 రూపాయలు కనీస రుసుముగా ఉంది.gas cylinder 2

# ఎల్పిజి ధరలను గ్యాస్ ఏజెన్సీలు ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తాయి. వచ్చే నెల ఎలా ఉండబోతోంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది.new atm rules for august 2021

# సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ 15 సీఏ, 15 సీబీ ఫామ్స్ ఎలక్ట్రానిక్ ఫైలింగ్ విషయంలో కొన్ని సడలింపులు ఇచ్చింది. గతంలో జూలై 15వ తేదీ వరకు ఉన్న చివరి తేదీ ఆగస్ట్ 15 వ తేదీ వరకు పొడిగించింది.

sourced from : sakshi


End of Article

You may also like