పుణ్యక్షేత్రాలను దర్శించడానికి వచ్చిన రష్యా యువతి…లాక్ డౌన్ కారణంగా కష్టాల్లో..!

పుణ్యక్షేత్రాలను దర్శించడానికి వచ్చిన రష్యా యువతి…లాక్ డౌన్ కారణంగా కష్టాల్లో..!

by Mohana Priya

Ads

పుణ్యక్షేత్రాల దర్శనం కోసం వచ్చిన ఒక విదేశీ యువతి లాక్ డౌన్ కారణంగా తన స్వస్థలానికి వెళ్లలేక, తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోవడంతో ఇబ్బందులు పడ్డారు. వివరాల్లోకి వెళితే. ఎస్తర్ రష్యాలో ఒక ఫిజియోథెరపిస్ట్. తనకి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఆలయ అలంకరణలో కూడా ఎస్తర్ కి ప్రవేశం ఉంది. ఫిబ్రవరి 6వ తేదీన ఎస్తర్ తన తల్లి ఒలివియా తో కలిసి టూరిస్ట్ వీసా పై ఇండియా కి వచ్చారు.

Video Advertisement

మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ లో పలు ప్రదేశాలు సందర్శించిన తర్వాత లాక్ డౌన్ మొదలైంది. దాంతో వాళ్లు ఇండియాలోనే ఉండిపోవాల్సివచ్చింది. ఈ నెల 19వ తేదీన వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతి కి వచ్చారు. కానీ కరోనా కారణంగా శ్రీవారి దర్శనం చేసుకునే వీలు లేదు అని చెప్పడంతో ఒకవేళ అధికారులు అనుమతిస్తే దర్శనం చేసుకుందామని అక్కడే ఎదురుచూశారు.

ఎస్తర్ తల్లి ఒలివియా “చాలా మంది రష్యన్లు ఉత్తరప్రదేశ్ లో ఉన్న బృందావన్ కి వస్తారు అని. అక్కడ ఏమైనా సహాయం దొరుకుతుందేమో చూస్తాను” అని బృందావన్ కి వెళ్లారు. కానీ కరోనా కారణంగా ఒలివియా అక్కడే ఉండిపోయారు. డబ్బులు లేని కారణంగా హోటల్ గదిని ఖాళీ చేసే ఇస్కాన్ లో ఆశ్రయం కోసం ప్రయత్నించారు ఎస్తర్. కానీ ఇస్కాన్‌లో ఉండే సదా రాందాస్ ఆంక్షల కారణంగా వసతి ఏర్పాటు చెయ్యలేము అని కానీ భోజన ఏర్పాట్లు చేస్తాము అని చెప్పారు.

అలిపిరి రోడ్డు లో తిరుగుతున్న ఎస్తర్ ని చూసి కపిల తీర్థం దగ్గరలో ఉన్న ఒక రెసిడెన్సీలో ఉండడానికి వసతి కల్పించారు. ఎస్తర్ తన పరిస్థితిని వివరించి తను ఇలా సహాయం తీసుకోవడం ఇదే మొదటిసారి అని, ఉచితంగా తనకి సహాయం వద్దు అని తను ఫిజియోథెరపిస్ట్ కాబట్టి వైద్యం అందిస్తాను అని చెప్పారు. ఇదంతా తెలుసుకున్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి వెంటనే స్పందించి తన పీఏ ఆర్‌.వెంకటేశ్వర్లు ద్వారా నగదు సహాయాన్ని అందించారు.

ప్రభుత్వ విప్ మరియు చంద్రగిరి ఎమ్మెల్యే అయిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మంగళవారం ఎస్తర్ ని కలిసి తన కోటాలో శ్రీవారి దర్శనం కల్పిస్తానని, తన సొంత డబ్బులు మీద ఎస్తర్ ని, తన తల్లితో పాటు రష్యా పంపిస్తానని, అప్పటి వరకు ఇక్కడ ఉండటానికి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

 


End of Article

You may also like