Ads
ధోని చిత్రంలో నటించిన సుశాంత్ సింగ్ రాజపుట్ అటు బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా ఎప్పుడూ గుర్తిండిపోతారు.అయితే తాజాగా సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్య చేసుకొని మృతిచెందారు.కాగా సినీ ప్రపంచమంతా విషాదంలో మునిగిపోయింది.అయితే టాలీవుడ్ నటి మాధవి లత సుశాంత్ మరణంపై స్పందిస్తూ…హీరో ఉదయ్ కిరణ్ మరియు సుశాంత్ ఇద్దరు కూడా మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చినవారే ,ఇద్దరు బాగా చదుకున్నవారే ,బ్లాక్బూస్టర్స్ అందుకున్న వారే కానీ డిప్రెషన్ వలన ఈ ఇద్దరు జీవితాన్ని ముగించుకున్నారు అనే ఒక మీమ్ ను సోషల్ మీడియాలో షేర్ చేసి ఒక పోస్ట్ రాసారు.ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ..
Video Advertisement
ఆత్మహత్య చేసుకొనే ప్రతీ వ్యక్తికి తమ వ్యక్తిగత కారణాలు ఉంటాయి కానీ ఆ కారణాలు డబ్బు గురించో ,పేరు గురించో కాదు ఆ కారణం అంతా కూడా మైండ్ మరియు చుట్టూ ఉన్న పరిస్థితులు అని మాధవి లత అభిప్రాయపడ్డారు.డిప్రెషన్ అనేది చాలా బాధాకరమని కేన్సర్ కంటే కూడా పెద్ద జబ్బు అని మాధవి లత అన్నారు.కొన్నిసార్లు డిప్రెషన్ లో ఉన్నవారికి కుటుంబసభ్యులు ,డాక్టర్లు,స్నేహితులు కూడా ఏమి సహాయం చేయకపోవచ్చు కానీ మనోధైర్యం ఉంటె డిప్రెషన్ ను ఎదుర్కోవచ్చు అని అన్నారు మాధవి లత.
డిప్రెషన్ అనేది ఏదో జ్వరం ,జలుబు లాగా చిన్నగా కనిపిస్తుంది అని కానీ డిప్రెషన్ ను అనుభవిస్తేనే అది ఎంత బాధాకరమో తెలుస్తుంది అని మాధవి లత అన్నారు.ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ డిప్రెషన్ లో ఉన్నారు అని చెప్తే లైట్ తీసుకోకండి ఆలా లైట్ తీసుకుంటే వాళ్ళు మనుషులే కాదు అని మాధవి లత అన్నారు.డిప్రెషన్ లో ఉన్నవారితో నవ్వుతూ ప్రేమగా మాట్లాడండి అని మాధవి లత అన్నారు.మనుష్యులుల ఉండాలనుకుంటే ఎమోషన్స్ తో ఉండీ ఎదుటివారికి సహాయం చెయ్యండి లేకపోతె అడువులలోకి వెళ్లిపోండి అని మాధవి లత అన్నారు.నాకు డిప్రెషన్ తో ఫైట్ చేసే శక్తీ ని ఇచ్చినందుకు భగవంతుడికి కృతఙ్ఞతలు అంటూ మాధవి లత పోస్ట్ ను ముగించారు.
End of Article