జూనియర్ ఎన్టీఆర్ మరొకసారి హోస్ట్ గా మన ముందుకు వచ్చారు. జెమినీ టీవీ లో టెలికాస్ట్ అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే ప్రోగ్రామ్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ప్రోగ్రామ్ కూడా ఎప్పుడో మొదలవ్వాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రాం మొదలయ్యింది.

Yevaru meelo koteeswarulu program first guest

ఈ ప్రోగ్రాం మొదలైనప్పటి నుంచి కూడా మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక క్విజ్ ప్రోగ్రాం మొదలవ్వడం, అందులోనూ జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రోగ్రాం కి హోస్ట్ చేయడం అనేవి ఎవరు మీలో కోటీశ్వరులు సక్సెస్ కి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. జెమినీ టీవీ జిఆర్పి (గ్రాస్ రేటింగ్ పాయింట్) 290 నుండి ఏకంగా 400 కి వెళ్ళిపోయింది. ఆ టైం స్లాట్ లో ఇంత జిఆర్పి పెరగడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. దాంతో బుల్లితెరపై మరోసారి తన మ్యాజిక్ ని చూపించారు జూనియర్ ఎన్టీఆర్.