తుఫాన్లకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసా? అంఫాన్ అంటే అర్ధం ఏంటంటే?

తుఫాన్లకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసా? అంఫాన్ అంటే అర్ధం ఏంటంటే?

by Mohana Priya

తుఫాను అనేది సహజంగా వాటిల్లే ఒక ఉపద్రవం. ప్రపంచంలో పలుచోట్ల తుఫానులు వస్తాయి. ప్రతి దాన్ని తుఫాను అని పిలవడం కష్టం. తుఫాను అంటే ఏ తుఫాను అనేది సులువుగా అర్థమయ్యే అవకాశం లేదు. కాబట్టి ప్రతి తుఫాన్ కి ఒక పేరు పెడుతున్నారు. అసలు ఈ పేర్లు ఎలా పెడతారో తెలుసుకుందాం.

Video Advertisement

ప్రతి సంవత్సరం ప్రపంచం అంతటా కలిపి దాదాపు 97 తుఫాన్లు సంభవిస్తాయి. మే నుండి నవంబర్ నెల మధ్యలో వీటి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తుఫాను తీవ్రతని బట్టి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు.

  • మెక్సికో, కరేబియన్, వెస్టిండీస్ దేశాలలో వీటిని హరికేన్స్ అంటారు.
  • అమెరికా, అట్లాంటిక్ దేశాల్లో టోర్నడో అంటారు.
  • ఇండియా, హిందూ మహాసముద్రం ప్రాంతంలో తుపాన్లు అంటారు.
  • ఆస్ట్రేలియా లో విల్లీ విల్లీ అని పిలుస్తారు.
  • చైనా, జపాన్, పిలిఫ్ఫైన్స్ లో రు టైపూన్స్ అంటారు.
  • అంటార్కిటికా లో బ్లిజార్డ్స్ అనే పేరుతో పిలుస్తారు.
  • ఇండోనేషియా లో బాగ్నోస్ అని అంటారు.

తుఫాన్లకు పేర్లు పెట్టే పరంపర అధికారికంగా 1945వ సంవత్సరం నుండి మొదలైంది. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో వచ్చిన తుఫానుకు అమెరికాలో ఉన్న నేషనల్ హరికేన్ సెంటర్ మొదటిసారిగా పేరు పెట్టారు. తుఫాన్ కి పేరు పెట్టడానికి కేవలం ఇంగ్లీష్ లెటర్లను మాత్రమే వాడుతారు.

ఒక సంవత్సరం A తో మొదలయ్యేలా, ఇంకొక సంవత్సరం B తో మొదలయ్యేలా అలా W వరకు అక్షరాలతో ఒక్కో సంవత్సరం ఒక్కో అక్షరంతో పేరు పెడతారు. కానీ ఇందులో నుండి Q,U అక్షరాలకు మినహాయింపు ఉంది. రేఖాంశాలు, అక్షంశాలకంటే పేర్లతో అయితే సులభంగా గుర్తు పట్టే అవకాశం ఉంటుందని భావించి హిందూ మహాసముద్రానికి చెందిన ఎనిమిది దేశాలు కలిసి 2004లో పేర్ల జాబితాను తయారు చేశారు.

సెప్టెంబర్ లో హిందూ మహా సముద్రంలో సంభవించిన తుఫాన్ కి ఓనిల్ అని పేరు పెట్టారు. ఈ పేరుని బంగ్లాదేశ్ సూచించింది. ఇండియా ని ఆనుకొని ఉన్నబంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడే తుపాన్ల లో అన్నిటికీ కాకుండా కేవలం 34 నాట్స్ కంటే గాలుల వేగం ఎక్కువగా ఉన్న తుఫాన్లకి మాత్రమే పేరు పెడుతున్నారు.

ఒక్కొక్క దేశానికి ఎనిమిది పేర్లు సూచించే వీలు ఉంటుంది. ఇప్పటిదాకా ఇలా ఒక్కో దేశం సూచించిన ఎనిమిది పేర్లతో 2 లిస్టులు పూర్తయ్యాయి.

గాలి వేగం గంటకి

  • 31 కిలోమీటర్లు ఉంటే దాన్ని అల్పపీడన ద్రోణి అంటారు
  • 31–49 కిలోమీటర్లు ఉంటే అది వాయుగుండం కిందకు వస్తుంది
  • 50–61 కిలోమీటర్లు ఉంటే తీవ్ర వాయుగుండం అంటారు
  • 62–88 కిలోమీటర్లు ఉంటే తుఫాన్ అంటారు
  • 89–118 కిలోమీటర్లు ఉంటే తీవ్ర తుఫాను అంటారు
  • 119–221 కిలోమీటర్లు ఉంటే అత్యంత తీవ్ర తుఫాన్ కిందికి వస్తుంది
  • 221 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉంటే సూపర్ సైక్లోన్ అంటారు

2018 సంవత్సరం నుండి పేర్లు పెట్టే దేశాలు 8 నుండి 13 దేశాలుగా మారాయి. కాబట్టి ఒక్కో దేశం 13 పేర్లను సూచించాలి అని నిర్ణయించారు. 2019లో ఆ పేర్లను పరిశీలించి 2020 లో అధికారికంగా పేర్లను ప్రకటించారు.పేర్లు పెట్టే 13 దేశాలు ఇవే

  • ఇండియా
  • బంగ్లాదేశ్
  • మాల్దీవులు
  • మయన్మార్
  • పాకిస్థాన్
  • శ్రీలంక
  • థాయిలాండ్
  • ఇరాన్
  • ఖతార్
  • సౌదీ అరేబియా
  • యెమన్
  • యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
  • ఒమన్

2014లో విశాఖపట్నం లో వచ్చిన హుద్‌‌హుద్ తుఫాను అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పేరును పెట్టింది ఒమన్. హుద్‌‌హుద్ అనేది ఇజ్రాయిల్ లో ఒక పక్షి పేరు. 2016లో బంగాళాఖాతంలో వచ్చిన తుఫాన్ మాల్దీవులు రోను అని పేరు పెట్టింది. 2016 లోనే అండమాన్, చెన్నై, కర్ణాటక, గోవాలో వచ్చిన తుపానుకు పాకిస్తాన్ వార్థా అని పేరు పెట్టింది. వార్థా అంటే ఎర్ర గులాబీ. గజ పేరుని శ్రీలంక సూచించింది. తిత్లీ పేరుని పాకిస్తాన్ సూచించింది.

ఇటీవల వచ్చిన తుపానుకు బంగ్లాదేశ్ థాయి భాషలో ఆకాశం అని అర్థం వచ్చేలా అంఫన్ అనే పేరును పెట్టింది. జూన్ లో వచ్చిన తుపానుకు నిసర్గ్ అని బంగ్లాదేశ్ పేరు పెట్టింది. ఏ దేశం నుండి పేరు సూచించినా వేరే దేశాల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తగా ఉండే పేర్లను పరిశీలించి ఎన్నుకుంటారు.

తర్వాత రాబోయే తుఫాన్ లకు ఒక్కొక్క దేశం ఈ విధంగా పేర్లను సూచించింది.

  • భారతదేశం గతి అనే పేరు సూచించింది
  • మాల్దీవులు బురేవి అనే పేరును సూచించింది
  • ఇరాన్ నివార్ అనే పేరును సూచించింది
  • మయన్మార్ టేట్‌‌కీ అనే పేరును సూచించింది
  • యూఏఈ మాండస్ అనే పేరును సూచించింది
  • థాయిలాండ్ సిత్రంగ్ అనే పేరును సూచించింది
  • పాకిస్తాన్ గులాబ్ అనే పేరును సూచించింది
  • శ్రీలంక అసాని అనే పేరును సూచించింది
  • సౌదీ అరేబియా జవాద్ అనే పేరును సూచించింది
  • యెమన్ మోచా అనే పేరును సూచించింది
  • ఖతార్ షహీన్ అనే పేరును సూచించింది
  • ఒమన్ యాస్ అనే పేరును సూచించింది

ఇలా ఒక్కొక్క తుఫాన్ కి పేరు పెట్టడం వెనుక ఇంత చర్చ జరుగుతుంది.


You may also like