సెక్యూరిటీ గార్డ్స్ నల్ల కళ్లద్దాలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? స్టైల్ కోసం కాదు…కారణం ఇదే.!

సెక్యూరిటీ గార్డ్స్ నల్ల కళ్లద్దాలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? స్టైల్ కోసం కాదు…కారణం ఇదే.!

by Mohana Priya

Ads

ఒక పెద్ద మాల్ ఓపెనింగ్ ఉంది. మీరు చాలా అభిమానించే సెలబ్రిటీ ఆ మాల్ ప్రారంభించడానికి అతిథిగా వస్తున్నారు. ఆ మాల్ కూడా మీరు ఉండే చోటికి ఎంతో దూరంలో లేదు. ఇంక దొరికిందే ఛాన్స్ అన్నట్లు ఆ సెలబ్రిటీ ని చూడడానికి ప్రారంభోత్సవానికి ఒక గంట ముందే వెళ్లి అక్కడ ఎదురుచూస్తూ ఉంటారు.

Video Advertisement

 

కొద్దిసేపటికి సెలబ్రిటీ వస్తారు. మీరు ముందే వెళ్లారు కాబట్టి ముందు వరుసలో నిలబడి ఉంటారు. ఆ సెలబ్రిటీ మీ పక్కన నుండే వెళ్తుంటారు. మీ అభిమాన సెలబ్రిటీ కాబట్టి మీరు ఎలాగైనా వాళ్లతో మాట్లాడాలి అనుకుంటారు. అలాగే వీలుంటే షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తారు.

మీకు మీ అభిమాన సెలబ్రిటీ కి మధ్యలో కొంచెం దూరం మాత్రమే ఉంటుంది. కాబట్టి మాట్లాడడానికి హాయ్ అని మొదలు పెడతారు. ఇప్పుడే మీకు మీ అభిమాన సెలబ్రిటీ కి మధ్య అడ్డుగోడలా ఒక వ్యక్తి వచ్చి నిలబడతారు. కండలు తిరిగిన శరీరంతో, ఎత్తుగా ఉంటారు. వాళ్ళు ఎవరో చెప్పక్కర్లేదు అనుకుంటా? అవును వాళ్లే బాడీగార్డ్స్.

ఎంత బతిమాలినా కూడా ఆ సెలబ్రిటీ ని కలవనివ్వరు. మనం కొంచెం నిరాశతో తిరిగి వెనక్కి వచ్చేస్తాం. ఒక్కసారి ఆలోచిస్తే అసలు బాడీగార్డ్ చేయాల్సిన పని అదే కదా. తోపులాట నుండి లేదా ఇతర ఇబ్బందుల నుండి సెలబ్రిటీలను రక్షించడం. చూసేవాళ్ళకి వాళ్ళు ఏదో స్టైల్ గా యూనిఫాం వేసుకుని, కళ్ళద్దాలు పెట్టుకుని, తల కూడా తప్పకుండా అలాగే నిల్చొని ఉంటారు అనిపిస్తుంది కానీ వాళ్లు అలా ఒకే చోట నిల్చుని ఎన్నో పనులు చేస్తారు.

ఇంకా వాళ్లు కళ్ళద్దాలు పెట్టుకునేది కూడా స్టైల్ కోసం కాదు. మామూలుగా మనం ఎవరినైనా తదేకంగా గమనిస్తుంటే వాళ్ళు చేసే పనిని ఆపేసి వెళ్ళిపోతారు. అందుకే బాడీగార్డ్ కళ్ళద్దాలు పెట్టుకుంటారు. ఇప్పుడు ఎవరైనా జనాల్లో కొంచెం అనుమాన పడేలా పనులు చేస్తుంటే బాడీగార్డ్స్ గమనిస్తారు.

అలా గమనించి ఒకవేళ అవతల వ్యక్తి చేసేది ఏదైనా తప్పు పని అయితే వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుంటారు. బాడీగార్డ్ కూడా కళ్ళద్దాలు పెట్టుకుని ఉంటారు కాబట్టి జనాల్లో ఎవరైనా తప్పు పని చేసే వ్యక్తులు ఉంటే తమను ఎవరూ గమనించరు అనుకుంటారు. అందుకే వాళ్లు అందరినీ, ముఖ్యంగా తప్పు చేసే వ్యక్తులని గమనిస్తూ ఉన్నట్టు తెలియకుండా బాడీగార్డ్స్ కళ్ళద్దాలు పెట్టుకుంటారు.

అంతేకాకుండా ఒక సెలబ్రిటీ అన్న తర్వాత ఎక్కడికైనా హాజరు అవుతారు అని ప్రమాణం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లు హాజరవుతారు. ఇక్కడ ఎట్టిపరిస్థితుల్లోనూ అంటే ఎలాంటి వాతావరణంలోనైనా అని అర్థం.

ఎండ ఎక్కువగా ఉండొచ్చు, వాన పడుతూ ఉండొచ్చు ఇంకా ఏదైనా కూడా అవ్వచ్చు. కానీ వాళ్లు హాజరవడం మాత్రం చాలా ముఖ్యం. వాళ్లు వెళ్తే ఖచ్చితంగా వాళ్లతో పాటు వాళ్ళ బాడీగార్డ్ కూడా వెళ్తారు. ఎలాంటి వాతావరణం అయినా కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేయాలి కాబట్టి ఎక్కువ ఎండ తగలకుండా, లేదా ఒకవేళ గాలి ఎక్కువగా వస్తూ ఉంటే వాళ్ల కళ్లలో దుమ్ము పడకుండా కళ్లద్దాలు పెట్టుకుంటారు.

ఎందుకంటే ఎండ గాలి వర్షం లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు చుట్టూ ఉన్న పరిసరాలని, వ్యక్తులని గమనించడానికి బాడీ గార్డ్ కి ఇబ్బంది అవుతుంది. అందుకే కళ్ళద్దాలు పెట్టుకుంటారు.

ఒక బాడీగార్డ్ ని ట్రైన్ చేసేటప్పుడు ఏ పరిస్థితిలో ఎలా వ్యవహరించాలి, ఎలాంటి పరిణామాలు ఎదురవుతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే వాటితో పాటు అలా కదలకుండా, తల కూడా తప్పకుండా కేవలం కంటి చూపుతోనే అందరిని ఎలా గమనించాలి అనేదానిపై కూడా శిక్షణ ఇస్తారట. అంతేకాకుండా మనకు తెలియని ఎన్నో చిన్న చిన్న విషయాలపై కూడా వాళ్లకి ట్రైనింగ్ ఇస్తారట.


End of Article

You may also like