సినిమాల్లో కాదు నిజంగానే…చనిపోయిన వాళ్ల‌ను తిరిగి తీసుకురావాలని “చైనా” ప్లాన్.! ఎలాగంటే.?

సినిమాల్లో కాదు నిజంగానే…చనిపోయిన వాళ్ల‌ను తిరిగి తీసుకురావాలని “చైనా” ప్లాన్.! ఎలాగంటే.?

by Mohana Priya

Ads

సినిమాల్లో మనం చూసే ఫాంటసీలలో చనిపోయిన వారిని తిరిగి తీసుకురావడం అనేది ఒకటి. కానీ ఇప్పుడు అదే నిజం చేయడానికి చైనా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. చైనా లోని షాన్‌డాంగ్‌ యిన్‌ఫెంగ్ లైఫ్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ అనే క్రయోనిక్స్ రీసెర్చ్ సెంటర్ లో చనిపోయిన వారిని ఒక స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్ లో, చాలా చల్లగా ఉన్న లిక్విడ్ నైట్రోజన్ లో, చాలా తక్కువ టెంపరేచర్ మీద ఉంచుతారు. ఇలా కొంతకాలం ఉంచిన తర్వాత ఆ మనిషి కి తిరిగి ప్రాణం వస్తుంది.

Video Advertisement

దీనిపై ప్రస్తుతం శాస్త్రవేత్తలు ప్రయోగం చేస్తున్నారు. ఇలా చేస్తే చనిపోయిన మనుషులు తిరిగి వస్తారా? అనే విషయం పక్కన పెడితే క్రయోనిక్స్ ఎక్స్పరిమెంట్ వల్ల మరొక ఉపయోగం ఉందట. అది ఏంటంటే సాధారణంగా కొంతమంది చనిపోయిన తర్వాత తమ అవయవాలను దానం ఇవ్వాలని అనుకుంటారు.

చనిపోయిన వారి అవయవాలను వేరే వాళ్ళకి ట్రాన్స్ ప్లాంట్ చేసే క్రమంలో ఒక్కొక్కసారి ఒక చోటు నుండి వేరే చోటుకు అవయవాలు తీసుకువెళ్ళేటప్పటికి సమయం పడుతూ ఉండొచ్చు. ఒక్కొక్క అవయవానికి కొంత టైం ఉంటుంది. క్రయోనిక్స్ పద్ధతి వల్ల ఆ సమయం ఆరు రోజుల వరకు పెంచవచ్చు.

అయితే అవయవాలు ఎక్కువ సేపు ఉండడం వరకు పర్వాలేదు కానీ మనిషి ప్రాణం మళ్ళీ తిరిగి రావడం అనేది మాత్రం నమ్మడం కొంచెం కష్టమే.  ఇది ఎంత వరకు నిజం అవుతుందో తెలుసుకోవాలి అంటే కొంతకాలం ఆగాల్సిందే.

 


End of Article

You may also like