ఎక్స్ట్రా మూవీ ఎక్స్ట్రాగా నష్టాలు…ఎంత లాస్ అంటే…!

ఎక్స్ట్రా మూవీ ఎక్స్ట్రాగా నష్టాలు…ఎంత లాస్ అంటే…!

by Mounika Singaluri

Ads

నితిన్ హీరోగా వచ్చిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే కామెడీ పరంగా మంచి టాక్ తెచ్చుకున్న కూడా కలెక్షన్స్ మాత్రం రాలేదు.దీంతో ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలింది.

Video Advertisement

ఈ సినిమాకి నితిన్ కెరియర్ లోనే లోయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చాయి.ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు 4.43 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. 23.3 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ ఎక్స్ట్రార్డినరీ మెన్ సినిమాపై జరిగింది.

24 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకోవాలంటే ఇంకా 19.57 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది. వారం రోజులు కష్టపడితే 4.43 కోట్ల షేర్ మాత్రమే తెచ్చుకున్న మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవడం అస్సలు ఇంపాజిబుల్ కాదని సినీ విశ్లేషకులు అంటున్నారు.నాని హాయ్ నాన్న మూవీ కూడా ఈ సినిమాకి మైనస్ గా మారింది.

ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే నితిన్ కెరియర్ లో మాచర్ల నియోజకవర్గం కంటే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఈ సినిమా మారేలా కనిపిస్తోంది. ఈ సినిమా కలెక్షన్స్ ఇంపాక్ట్ నితిన్ నెక్స్ట్ సినిమాలపై కూడా పడే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.నెక్స్ట్ సినిమా నుండి అయిన నితిన్ జాగ్రతలు తీసుకోవాలని అభిమానులు అంటునారు.ఇలా అయితే నితిన్ కెరీర్ కే ప్రమాదం వస్తుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు


End of Article

You may also like