Home Filmy Adda ‘F3’ కాన్సెప్ట్ ఇదేనా..? ఓ వైపు తమన్నా మరోవైపు మెహ్రిన్.!

‘F3’ కాన్సెప్ట్ ఇదేనా..? ఓ వైపు తమన్నా మరోవైపు మెహ్రిన్.!

by Sunku Sravan

Ads

ఇప్పటికే సీనియర్ నటుడు హీరో వెంకటేష్ మరియు యంగ్ హీరో వరుణ్ తేజ కాంబినేషన్ లో ఎఫ్2 సినిమా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆదరించి కడుపు చెక్కలయ్యేలా నవ్వించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎఫ్ 3సినిమాతో అనిల్ రావిపూడి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పటాస్ సినిమాతో మొదలైన అనిల్ రావిపూడి ప్రస్థానం సరిలేరు నీకెవ్వరు అనే సినిమా వరకు అసలు బ్రేక్ లేకుండా వరుస హిట్లతో కొనసాగుతోంది.

Video Advertisement

కామెడీ సినిమాలు తీయడంలో అనిల్ దిట్ట అని చెప్పవచ్చు. ఆయన సినిమాలంటేనే ఫ్యామిలీతో సహా వెళ్లి ఎంజాయ్ చేయవచ్చు. సరిలేరు నీకెవ్వరు మహేష్ బాబుతో పండించిన కామెడీ చూసి ఎంత నవ్వుకున్నారో మీకు తెలుసు కదా.. మరోవైపు హీరో వెంకటేష్ యంగ్ హీరో వరుణ్ తేజ కాంబినేషన్ లో ఎఫ్ 2 సినిమాలో కూడా సినిమా మొదలైనప్పటి నుంచి చివరి ఎండింగ్ వరకు అందరినీ కడుపుబ్బ నవ్వించిన ఘనత అనిల్ రావిపూడిదే.

ఈ మూవీలో వరుణ్ తేజ్ వెంకీ తమన్నా మెహరీన్ తో పాటుగా వాళ్ళమ్మ ప్రగతి వారి ఇంట్లో ముసలమ్మలు, వై విజయ, అన్నపూర్ణ పెట్టినటువంటి టార్చర్ మామూలుగా లేదు. దీంతో మనం ఎంత నవ్వుకుంటే అంతా కామెడీ జనరేట్ అయింది


F3తో మళ్లీ మన ముందుకు..ఎఫ్ త్రీ మూవీ కూడా అంతకు మించి కామెడీ ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలోని కథంతా డబ్బు చుట్టూనే తిరుగుతుంది అని, భార్యలు అత్యాశ బడి బాగా సంపాదించాలని భర్తలను టార్చర్ పెడతారట.. వారి గొంతెమ్మ కోరికలు తీర్చ లేక వెంకీ వారు పడే పాట్లు.. ఇంకా కావాలని ఆ కాన్సెప్టుతో చాలా కామెడీ జనరేట్ అవుతుందని తెలుస్తోంది. ఇందులో కీలక పాత్రలో సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్, సంగీత, అంజలి, సునీల్ కూడా కనిపించనున్నారు.


End of Article

You may also like