బండ్ల గణేష్ ని ఎలా అడ్డుకున్నారో.. నన్ను కూడా అలాగే అడ్డుకుంటున్నారు అంటూ.. సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సుమ..?

బండ్ల గణేష్ ని ఎలా అడ్డుకున్నారో.. నన్ను కూడా అలాగే అడ్డుకుంటున్నారు అంటూ.. సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సుమ..?

by Sunku Sravan

Ads

యాంకర్ సుమ తెలుగు ఇండస్ట్రీలోనే ప్రముఖ యాంకర్ లలో సుమ మొదటి స్థానంలో ఉందని చెప్పవచ్చు. ఆమె మైక్ చేతబట్టిందంటే స్టేజ్ పై రచ్చ, రచ్చ చేసేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.అయితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఎఫ్3.. దీనిని ఎఫ్2 సీక్వెల్ గా తీసుకువచ్చారు.

Video Advertisement

ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. అయితే ఈ మూవీ ఈ నెల 20వ తేదీన థియేటర్ లోకి రానున్న సందర్భంగా దీని ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాంకర్ గా వ్యవహరించిన సుమా తెలంగాణ యాసలో పంచులతో అదరగొట్టింది.

 

సుమా ఎప్పుడూ అలాగే ఫన్నీ మాటలతో అలరిస్తూ ఉంటుంది. అయితే ఈ ప్రోగ్రాం లో సుమ చేసిన వ్యాఖ్యలు మాత్రం చర్చనీయాంశంగా మారాయి. గతంలో నిర్మాత బండ్ల గణేష్ అన్నట్టుగా ఒక వాయిస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఒక ప్రముఖ దర్శకుడు ఆయనను భీమ్లా నాయక్ సినిమా ఈవెంట్ కు రాకుండా అడ్డుకున్నారు. అని ఆ వాయిస్ లో ఉన్నది. అదికూడా అచ్చం బండ్ల గణేష్ వాయిస్ ను పోలినట్టే ఉన్నది.

దీంతో అందరూ బండ్ల గణేష్ ఈ వ్యాఖ్యలు చేశారని అనుకున్నారు. తర్వాత ఆయన ఆ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టంగా తెలియజేశారు. ఈ విధంగా బండ్ల గణేష్ బీమ్లా నాయక్ ఈవెంట్ కు హాజరు కాకుండా ఈ విధంగా అడ్డుకున్నారో. అలాగే తనను కూడా కొంతమంది ఎఫ్3 ఈవెంట్ కి రాకుండా అడ్డుకున్నారు అంటూ ఆశ్చర్యకర కామెంట్స్ చేసింది. అయితే సుమా అలా కావాలనే కామెంట్ చేసిందా.

లేదంటే ఆమెను ఈవెంట్ కు రాకుండా ఎవరైనా అడ్డుకున్నారా అన్న విషయం మాత్రం ఇప్పటి వరకు తెలియలేదు. అయితే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క సినిమా రిలీజ్ ఈవెంట్ లకు సుమనే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. కనుక చాలా మంది యాంకర్లు సుమ పై కాస్త కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే సుమ ఈ విధంగా కామెంట్లు చేసిందా అని భావిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరగగా.. సినిమా బంపర్ హిట్ ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది.


End of Article

You may also like