Ads
ఢిల్లీ లిక్కర్ కేసులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. మధ్యంతర బెయిల్ పిటిషన్ కోసం రౌస్ ఎవెన్యూ కోర్టులో జరిగిన విచారణలో, ఇరు వైపుల వాదనలు విన్న తర్వాత విచారణని ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేశారు. ఆరోజు మధ్యాహ్నం రెండున్నర గంటల సమయానికి పిటిషన్ మీద విచారణ జరుగుతుంది. కవిత కేసు వాదిస్తున్న లాయర్ అభిషేక్ మను సింఘ్వి కవితకి మధ్యంతర భైలు మంజూరు చేయడంతో పాటు రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేయాలి అని ధర్మాసనాన్ని అడిగారు.
Video Advertisement
ఎఫ్ఐఆర్ లో కవిత పేరు లేదు. అయినా కూడా ఆమెని అరెస్ట్ చేశారు అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేశారు. కవిత ప్రస్తుతం తీహార్ జైల్ లో ఉన్నారు. అరెస్ట్ చేసి తీసుకెళ్లిన రోజు మెడికల్ ఎగ్జామినేషన్స్ జరిగాయి. ఆ తర్వాత సెల్ లోకి పంపించారు. మెడికల్ చెక్ అప్ లో కవితకి బ్లడ్ ప్రెషర్ తక్కువగా ఉన్నట్టు తెలిసింది. తర్వాత అది నార్మల్ స్థితికి చేరుకుంది. జైలులో కవితకి ఒక పరుపు, చెప్పులు, బట్టలు, కప్పుకోవడానికి ఒక దుప్పటి, ఒక బెడ్ షీట్ ఇచ్చారు. జైలు నియమాల ప్రకారం ఇవన్నీ ఇచ్చారు. మెడిసిన్స్ కూడా ఇచ్చారు. కవిత ఎటువంటి సౌకర్యాలు కావాలి అని అడగలేదు.
కోర్టు ఆర్డర్ ప్రకారం, జైలు నియమాల ప్రకారం ఉన్న సౌకర్యాలు కవితకి ఇస్తారు. ఇంట్లో వండిన ఆహారాన్ని, పరుపుని, చెప్పులని, బట్టలని, ఒక బెడ్ షీట్, ఒక బ్లాంకెట్, వాటితో పాటు, పుస్తకాలు, పెన్, పేపర్, మెడిసిన్స్ కూడా ఇవ్వాలి అని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా జైలులో మెడిటేషన్ చేయడానికి జపమాలని కోరారు. వాటితో పాటు స్పోర్ట్స్ షూ, అందులోనూ లేస్ లేని షూ ఇవ్వాలి అని అడగగా, అందుకు కూడా ధర్మాసనం అనుమతి ఇచ్చారు.
కవితకి ఆభరణాలు వేసుకునేందుకు అనుమతి కూడా ఉంది. కానీ కవిత ఎటువంటి ఆభరణాలు కూడా వేసుకోవట్లేదు. టీ తాగే టైం, తినే టైం, టీవీ చూసే టైం మిగిలిన వారితో పాటు కవితకి కూడా అవే సమయాలు ఉంటాయి. తీహార్ జైలులో ఒక లైబ్రరీ కూడా ఉంటుంది. జైలులో ఉన్న వారి కోసం ఆ లైబ్రరీ తెరిచి ఉంటుంది. అక్కడ ఉన్న పుస్తకాలు చదివే సౌలభ్యం కూడా కవితకి ఉంది. ఆ యాక్సెస్ ని కవితకు జారీ చేశారు.
End of Article