Ads
జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తరవాత హీరో అల్లు అర్జున్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ నుంచి వస్తున్న చిత్రం అల వైకుంఠపురములో… భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా ఈ సినిమాని ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో అలనాటి తార టబు రీఎంట్రీ ఇవ్వడం, తమన్ అందించిన పాటలకి మంచి క్రేజ్ రావడం, టీజర్, ట్రైలర్స్ లలో త్రివిక్రమ్ మార్క్ కనిపించడం సినిమాపైన భారీ అంచనాలను పెంచేసాయి,
Video Advertisement
బన్ని ఫ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్ యాక్టింగ్ , డాన్స్ ఇరగాదీశాడని అంటున్నారు. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యిందని, ఇక ఇంటర్వెల్ బ్లాక్ సూపర్బ్ అనిపించేలా ఉందంటున్నారు.ఇక త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, పంచులు బాగా పేలాయని అభిప్రాయపడుతున్నారు. ఇక సినిమాలో బన్ని తర్వాత మురళీశర్మ పాత్ర బాగుందని, తండ్రి పాత్రలో ఇరగాదీశాడని అంటున్నారు. సినిమాలో హీరోయిన్స్ ఇద్దరు గ్లామర్ షోకి మాత్రమే పరిమితం అయ్యారని అంటున్నారు.
తమన్ అందించిన పాటలు స్క్రీన్ పైన బాగున్నాయని అంటున్నారు. నేపధ్య సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయిందని అంటున్నారు. పి యస్ వినోద్ అందించిన సినిమాటోగ్రఫీ అదిరిపోయిందని అంటున్నారు. సముద్రఖని, సుశాంత్, వెన్నల కిశోర్, నవదీప్, రాహుల్ రామకృష్ణ లాంటి నటులను ఉన్నప్పటికీ వారిని సరిగ్గా వాడుకోలేదన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి టాక్ అయితే సినిమాకు సూపర్ పాజిటివ్ టాక్ వచ్చింది.
సినిమా రిలీజ్‌కు ముందే మంచి అంచనాలు క్రియేట్ చేసింది.కానీ ఈ సినిమాను రిలీజ్ చేసే విషయంలో మాత్రం త్రివిక్రమ్ లెక్క తప్పిందని అంటున్నారు కొంతమంది నిపుణులు.సంక్రాంతి బరిలో ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు సినిమా, రజినీకాంత్ గారు నటించిన దర్బార్ లు సినిమా లు రిలీజ్ అయ్యి శని,ఆదివారాల కలెక్షన్లు కొల్లగొట్టింది.అయితే అల వైకుంఠపురము సినిమాను గురువారం లేక శుక్రవారం కాకుండా ఏకంగా ఆదివారం రిలీజ్ చేయడంతో ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ల రికార్డును మిస్ చేసుకుంది.రెండు రోజుల తేడాతో ఇంత హడావిడిగా పండుగ సీజన్‌లోనే రిలీజ్ ఎందుకు చేశారనేది చిత్ర వర్గాల ప్రశ్న.కాస్త సమయం ఇచ్చి రిలీజ్ చేసి ఉంటే అదిరిపోయే కలెక్షన్లు వచ్చేవి అని సినీ ప్రముఖులు తో పాటు బన్నీ ఫ్యాన్స్ చెపుతున్నారు..
End of Article