ప్రతి తండ్రికి తన పిల్లలను గొప్పవారిని చేయాలనే ఆశ, తపన ఉంటాయి. తన పిల్లల కోసం రేయింబవళ్ళు వారి తండ్రి కష్టపడి పనిచేస్తుంటాడు. అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా కష్టపడతారు. అయితే తనను చదివించడం కోసం రేయనక, పగలనక పనిచేస్తున్న తన తండ్రి కష్టాన్నిచూడలేని కూతురు ఎవరూ తీసుకోకూడని నిర్ణయాన్ని తీసుకుంది. ఆ తండ్రిని తీరని దుఖంలో వదిలి వెళ్ళింది. అయితే ఆ తండ్రి కూతురు గురించి తెలుసుకుందాం..

Video Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరిలోని రాజంపేట అనే గ్రామానికి చెందిన కవల వెంకటేశ్వరరావు అనే కూరగాయల వ్యాపారికి ఇద్దరు సంతానం. ఒక కుమార్తె, ఒక కొడుకు. రాజమహేంద్రవరంలోని రైతు బజారులో వెంకటేశ్వరరావు కూరగాయలు అమ్ముతూ తన ఫ్యామిలిని పోషిస్తున్నాడు. అయితే ఈ క్రమంలో వెంకటేశ్వరరావుకి  అనారోగ్యం ఏర్పడింది. తన చికిత్స కు ఉపయోగించాల్సిన డబ్బును తన కుమార్తె సత్యనాగును చదివించడం కోసం ఖర్చు చేసేవాడు.
east-godavari-daughterకానీ సత్యనాగు ఆమె తండ్రిని తన చదువు కోసం కాకుండా ఆ డబ్బుతో మందులు కొనుక్కోమని తండ్రికి ఎంతగానో చెప్పేది. దానికి ఆమె తండ్రి నువ్వు చదువుకుంటే కుటుంబంలో అందరం బాగుంటామని, నాకేం కాదని కూతురికి  చెప్పేవాడు. కానీ సత్యనాగు తనని చదివించాలనే ఉద్దేశ్యంతోనే తన తండ్రి ఆరోగ్యాన్ని లెక్కచేయడం లేదని  బాధపడింది.
east-godavari-daughter1 దాంతో ఆమె ఇంట్లో ఉన్న క్రిమిసంహారక మందు తాగి ప్రాణం తీసుకోవడానికి ప్రయత్నించింది. అది గమనించిన కుటుంబ సభ్యులు సత్యనాగును వెంటనే హాస్పటల్ కి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. తన కూతురు సత్యనాగు బాగా చదివించాలనుకున్న వెంటకేశ్వరరావు ఇలా జరిగిందని శోక సాగరంలో మునిగిపోయారు.

Also Read: పెద్దదిక్కువి అవుతావు అనుకుంటే విడిచి వెళ్ళిపోయావా..? కంటతడి పెట్టిస్తున్న సంఘటన..!