Ads
మందు అనే వ్యసనం కుటుంబాలను నాశనం చేస్తుందని తెలిసి కూడా జనాలు తెగ తాగేస్తున్నారు.ఎంతలా అంటే మందు బ్యాన్ పెట్టిన ప్రభుత్వాలను అధికారంలోకి రాకుండా తొక్కేస్తున్నారు.అంత పవర్ ఉంది మన మందుబాబులకు.మంచి ఎంత చెప్పినా ఎవరు చెప్పిన మనకి ఎక్కదు కదా! తాజాగా ఇలాంటి ఓ మందుబాబు వల్ల తన కుటుంబం రోడ్డున పడింది.
Video Advertisement
ఇంతకీ విషయమేంటంటే నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలం చించోలి గ్రామానికి చెందిన సాయన్న, శ్యామల దంపతులకు ఇద్దరు కుమార్తెలు,ఒక కుమారుడు ఉన్నాడు.నాలుగేళ్ల క్రితం పెద్ద కుమార్తెకు పెళ్లి చేసిన ఈ కుటుంబం సాయన్న మద్యం బానిస అవ్వడం వల్ల పూర్తిగా అప్పుల పాలయ్యారు..దానితో అప్పులు తీర్చడం కోసం కొడుకు సతీష్ వారికున్న మూడెకరాల పొలాన్ని అమ్మి 20 లక్షల అప్పు తీర్చి మిగతా రూ.10 లక్షలను తన రెండో చెల్లి పెళ్లి కోసం దాచాడు.
కాని సాయన్న తన తాగుడు కోసం ఆ డబ్బును నీళ్లలా ఖర్చు చేయడం మొదలుపెట్టాడు.సతీష్ ఎంత చెప్పిన తండ్రి మాట వినకపోవడంతో మనస్తాపానికి గురైన సతీష్ గ్రామ శివార్లో ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
End of Article