ఆ తండ్రి చేసిన పనిపై మీ అభిప్రాయం ఏంటి? అతని కూతురి స్కూల్ సర్టిఫికెట్ చూసి చెప్పండి!

ఆ తండ్రి చేసిన పనిపై మీ అభిప్రాయం ఏంటి? అతని కూతురి స్కూల్ సర్టిఫికెట్ చూసి చెప్పండి!

by Mohana Priya

మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలరు. దానికి నిదర్శనం ఇటీవల జరిగిన ఈ ఘటన. అహ్మదాబాద్ కి చెందిన రాజీవ్ ఉపాధ్యాయ అనే వ్యక్తి ప్రభుత్వం వద్దకు వెళ్లి తన పేరుని సర్టిఫికేట్ లో RV155677820 గా మార్చమని అడిగాడు. ఇది తన పేరు ఇంకా రోల్ నెంబర్ కలిపితే వచ్చింది.

Video Advertisement

2017 లో తాను నాస్తికుడిగా మారిపోయినట్టు తనకి ఇప్పటినుంచి కులం మతం మీద ఎటువంటి నమ్మకం లేనట్టు అందుకే తన పేరుని మార్చమని ప్రభుత్వాన్ని అడిగారు. కానీ ప్రభుత్వం అతను అడిగిన దాన్ని తిరస్కరించింది.

ప్రభుత్వం అతని పేరు మార్చడానికి తిరస్కరించినప్పటికీ అతను తనకి కాకపోయినా తన కుమార్తె ఆకాంక్ష సర్టిఫికెట్లలో కులం మతానికి సంబంధించిన ఎటువంటి వివరాలు ఉండకూడదు అని అనుకున్నారు. అందుకే తన సర్టిఫికెట్లలో కులం, రిలీజియన్, సెక్టార్ ఆర్ రేస్ అనే వివరాలను రాయనియ్యలేదు.

ఇదంతా రాజీవ్ కి అంత సులభంగా జరగలేదు. దీని కోసం మూడు నెలలు కష్టపడాల్సి వచ్చింది. అహమదాబాద్ డిస్టిక్ కోర్టులో దీనిపై కేస్ జరిగింది. రాజీవ్ చెన్నైకి చెందిన స్నేహ అనే లాయర్ కి తాను అసలు ఈ మతం కులం కి సంబంధించిన వివరాలు ఎందుకు మెన్షన్ చేయొద్దు అనుకుంటున్నాడు అనేది వివరించి స్నేహ ఈ కేసు వాదించడానికి ఒప్పుకునే లాగా చేశారు.

ఎన్నో వాదనలు విన్న తర్వాత, ఎన్నో కష్టాలు పడ్డ తర్వాత చిట్టచివరికి రాజీవ్ అడిగిన దానికి ప్రభుత్వం ఆమోదించింది.దీనిపై రాజీవ్ మాట్లాడుతూ ” నేను నాస్తికుడిని. నాకు నా కులం మతం బయటకు చెప్పడం ఇష్టం లేదు. ప్రభుత్వం దీనికి మద్దతు ఇవ్వాలి.

ఒకవేళ నేను నా పూర్తి పేరు రాస్తే నేను ఏ కులానికి చెందినవాడిని అనే విషయం అందరికి తెలిసిపోతుంది. కులం మతం తోటి వచ్చే గుర్తింపు నాకు అవసరం లేదు. నేను అహ్మదాబాద్ జిల్లా కలెక్టర్ మరియు ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి ఎన్నో రకాలుగా నా వివరణను ఇచ్చాను. అప్పుడు ఆయన అర్థం చేసుకొని నా ప్రతిపాదనకు అంగీకరించారు. ఆయన ఇచ్చిన సర్టిఫికేట్ తీసుకొని నేను ఆకాంక్ష స్కూల్ కి వెళ్లి మేనేజ్మెంట్ తో మాట్లాడాను” అని అన్నారు.

 


You may also like