మాస్ట్రో నుండి ఆ సీన్స్ కట్..! కారణం ఏంటంటే..?

మాస్ట్రో నుండి ఆ సీన్స్ కట్..! కారణం ఏంటంటే..?

by Mohana Priya

Ads

నితిన్, తమన్నా, నభా నటేష్ ముఖ్య పాత్రల్లో నటించిన మాస్ట్రో సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా హిందీలో సూపర్ హిట్టయిన అంధాధున్ సినిమాకి రీమేక్‌గా రూపొందింది. ఈ తెలుగు రీమేక్ కి ఎక్స్ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం చిత్రాల దర్శకుడు అయిన మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చారు. అయితే, మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు సినిమాలో మార్పులు చేశారు అని సమాచారం.

Video Advertisement

అందులోనూ ముఖ్యంగా కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలని తెలుగు నేటివిటీ కోసం తొలగించేశారట. అంతే కాకుండా కొంచెం హ్యూమర్ తో పాటు, సెకండ్ హాఫ్ లో ఒక ఎమోషనల్ పాయింట్ కూడా యాడ్ చేశారట. అన్ని వయసులకి చెందిన వాళ్ళు ఈ సినిమా చూడాలని ఉద్దేశంతోనే సినిమాలోని అభ్యంతరకరమైన సన్నివేశాలని కట్ చేశారట. ఈ సినిమాకి మాస్ట్రో అని టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి అంటే హీరో మాస్ట్రో ఇళయరాజా గారి అభిమాని. ప్రస్తుతం సినిమా బృందం అంతా యాక్టివ్ గా ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో పాల్గొంటోంది.


End of Article

You may also like