Ads
కరోనా, కరోనా, కరోనా.. చైనా లో పుట్టి ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టించి, ఎంతో మంది జీవితాలను అల్లకల్లోలం చేసింది. దీని దాటికి తల్లులు బిడ్డలకు, బిడ్డలు తల్లులకు మానవ సంబంధాలే అనేవి లేకుండా బంధుత్వాలు అనేవి లేకుండా చేసింది. కన్నతండ్రి, లేదా కన్నతల్లి, కన్న కొడుకుకు కరోనా వచ్చి చనిపోతే కనీసం కాటికి కూడా పంప లేనటువంటి నిస్సహాయ పరిస్థితిని మిగిల్చింది.. ఈ వైరస్ బారిన పడి ఎంతోమంది ఆకస్మాత్తుగా చనిపోవడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడి బిక్కుబిక్కుమంటూ ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి.\
Video Advertisement
ఎన్నో హాస్పటల్లో హృదయ విదారక ఘటనలు చూస్తే గుండె తరుక్కు పోయే పరిస్థితి ఏర్పడింది. దీని దాటికి లక్షలాదిమంది పువ్వుల్లా రాలిపోయారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం కనీసం దహనం చేయడానికి కూడా ఎవరూ రాకపోవడంతో కుళ్ళిన శవాలు కూడా ఉన్నాయి. దీని బారిన పడి ఎన్నో కుటుంబాలు భూములు,ఆస్తులు అమ్ముకొని ఆగమ్యగోచరంగా తయారయ్యారు. ఇంతటి కఠిన పరిస్థితి ఐదో తరగతి చదువుతున్న బాలిక అనుభవించింది. తన లేఖ ద్వారా తన తండ్రి కరోనా బారిన పడి ఏవిధంగా చనిపోయాడో తెలియజేసింది. అది చదివితే మనకు కన్నీరు ఆగదు.
అంతటి బాధాతప్త హృదయంతో ఆ బాలిక రాసిన లేక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కరోనా సమయంలో తన తండ్రిని కాపాడుకునేందుకు ఆ బాలిక కుటుంబ సభ్యులు పడిన పాట్లు, వైద్యం కోసం వారు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కన్నతండ్రి కాటికి సిద్ధమైన సమయంలో వీరు ఏమి చేయలేక, తండ్రి ఇంటికి రాలేక ఆ కుటుంబ సభ్యుల రోదనలు ఆకాశాన్నంటాయి. ఇంతటి బాధను ఆ బాలిక ఆ లేఖలో వ్యక్తపరిచింది.
తన గుండెల్లో అంత బాధను దాచుకొని తన ఫ్రెండ్ కు ఈ లేఖను రాసింది. రంగారెడ్డి జిల్లాలోని ఫరూక్ నగర్ మండలం లింగారెడ్డి గూడా పాఠశాలలో సుధా కుమారి అనే బాలిక అయిదవ తరగతి చదువుతున్నది. ఆదివారం రోజు నుండి ఎండాకాలం సెలవులు కావడంతో శనివారం చివరి రోజు తన ఫ్రెండ్ కు ఈ లేఖను రాసింది. ఈ లేఖ చూస్తే ఆ చిన్నారి ఎంత మానసిక వేదనను అనుభవించిందో, ఆ చిన్నారి ఇలాంటి ఎన్నో కుటుంబాలు ఎంత వేదన అనుభవించారో అర్థం చేసుకోవచ్చు. ఇది చదివితే తప్పకుండా కన్నీరు పెట్టడం ఖాయం.
End of Article