Ads
కరోనా వ్యాప్తి కొంచెం తగ్గడంతో ప్రజలు బయటకు వస్తున్నారు. మళ్లీ పనులు ఎప్పటిలాగానే మొదలవుతున్నాయి. ప్రతి చోట జనాలు ఎక్కువగానే ఉంటున్నారు. కానీ ఏదేమైనా ఇంకా పూర్తిగా తగ్గలేదు కాబట్టి సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. వీలైనంత వరకు అవసరమైతే తప్ప పెద్దగా బయటికి వెళ్ళని వాళ్లు కూడా ఉంటున్నారు.
Video Advertisement
కానీ కొన్ని చోట్ల మాత్రం అసలు కరోనా అనేది ఒకటి ఉంది అనే విషయం మర్చిపోతున్నారు. వివరాల్లోకి వెళితే. ఇటీవల పాకిస్తాన్ లో ముల్తాన్ రోడ్ ప్రారంభించబడింది. పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ షా మహ్మద్ ఖురేషీ ఈ రోడ్ ని ప్రారంభించారు.
ఈ ఈవెంట్ కి చాలా మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అక్కడ ఉన్న ప్రజలందరూ కేక్ తీసుకోవడానికి గుంపుగా వచ్చారు. సామాజిక దూరం మర్చిపోయారు. అంతే కాకుండా అక్కడ చాలా మందికి మాస్కులు కూడా లేవు.
మహమ్మద్ ఖురేషి కూడా కేక్ తిందాం అనుకొని అంతలోపే తాను మాస్క్ ధరించాను అని గుర్తుకి వచ్చి వెళ్ళిపోయారు. అక్కడ జరిగిన ఈ సంఘటనని నైలా ఇనాయత్ అనే ఒక ప్రముఖ జర్నలిస్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సంఘటన కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
watch video :
Cake fight erupts as foreign minister Shah Mahmood Qureshi inaugurates a road in Multan. pic.twitter.com/gTqeFjUSz7
— Naila Inayat (@nailainayat) February 8, 2021
End of Article