Ads
తెలుగు ఫిలిం ఫెడరేషన్ కార్మికులు తమ వేతనాలు పెంచాలంటూ సమ్మె బాటపట్టిన విషయం తెలిసిందే. తమ జీతభత్యాలు పెంచేంత వరకు పనులకు రామని తెగేసి చెప్పారు. అంతేకాకుండా నిన్న తెలుగు ఫిలిం ఛాంబర్ ముందు నిరసన వ్యక్తం చేశారు.
Video Advertisement
అయితే.. నిర్మాతల మండలి మాత్రం.. కరోనా ప్రభావంతో తీవ్రంగా నష్టపోయామని.. ఇప్పట్లో సినీ కార్మికుల వేతనాలు పెంచే పరిస్థితులు లేవని వెల్లడిస్తోంది. దీంతో.. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి తెలుగు ఫిలిం ఫెడరేషన్ కు మధ్య వివాదం ముదురుతోంది.
సినీ కార్మికులు సమ్మెలో ఉండటంతో.. టాలీవుడ్‌లో ఎక్కడి సినిమాలు అక్కడే నిలిచిపోయాయి. హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో సుమారు 28 సినిమాల షూటింగ్ నిలిచిపోయింది. భారీ బడ్జెట్ సినిమాలైన సలార్, ప్రాజెక్ట్ కే లాంటి సినిమాలకు సైతం సీనికార్మికుల సమ్మె తాకిడి తగలింది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా సినిమాలోని 24 విభాగాల్లో పనిచేసే కార్మికులంతా పనికి హజరుకాకపోవడంతో సినిమాలు షూటింగ్ ప్రశ్నార్థకంగా మారింది. అయితే.. ఈ రోజు నుంచి ఎప్పటిలాగే షూటింగ్స్ లో కార్మికులు పాల్గొనాలి తెలుగు ఫిలిం ఛాంబర్ కోరింది. లేని పక్షంలో ఆరు నెలల పాటు షూటింగ్స్ నిలిపి వేస్తామని నిర్మాతల మండలి ప్రకటించింది.
నిర్మాతలు ఎవ్వరూ కార్మిక సంఘాల ఒత్తిళ్లకు గురి కావొద్దు అని తెలుగు ఫిలిం ఛాంబర్ పేర్కొంది. అయితే.. ఎట్టిపరిస్థితుల్లో వేతనాలు పెంచేంత వరకు షూటింగ్ లకు హాజరుకాము అంటూ.. ఫెడరేషన్ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతమున్న రెమ్యునరేషన్ కన్నా 45 శాతం ఎక్కువ ఇవ్వాలి అని ఫెడరేషన్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సినీ కార్మికుల్లో విభేదాలు సృష్టిస్తే నష్టా పోయేది నిర్మాతలేనని ఫెడరేషన్ సభ్యులు వ్యాఖ్యానించారు.
End of Article